PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆనందోత్సాహాలతో పరస్పర శుభాకాంక్షలతో నూతన సంవత్సర వేడుకలు..

1 min read

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలి..

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : నూతన సంవత్సరంలో ఏలూరు జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు.  నూతన సంవత్సరం 2024 సందర్బంగా సోమవారం ఏలూరు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాలతో పరస్పర శుభాకాంక్షలతో జరిగాయి.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, ,  డిఎఫ్ ఓ రవీంధర్ దామ, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి మెమెంటో, పుష్పగుచ్ఛాలను అందజేశారు.  అనంతరం జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, ఐటిడిఏ పివో యం. సూర్యతేజ, నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్ష్ రాజేంద్రన్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ టి. శ్రీపూజ,  ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె. ఖాజావలి, జంగారెడ్డిగూడెం ఆర్డిఓ ఎ. అద్దయ్య, కలెక్టరేట్ ఏవో రమాదేవి, కలెక్టరేట్ సిబ్బంది,  జిల్లాకు చెందిన పలువురు ఉన్నాతాధికారులు, ఉద్యోగస్తులు, తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.  పలువురు రెవిన్యూ, పోలీస్ ఉన్నతాధికారులతోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పలువురు మండలస్ధాయి అధికారులు,  వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పెద్దఎత్తున ప్రజలు, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కు  పుష్పగుచ్ఛాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్బంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనరు సిహెచ్.రంగారావు ఆధ్వర్యంలో రామచంద్రరావు పేట వెంకటేశ్వరస్వామి దేవస్ధానం ప్రధాన పురోహితులు కిలాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు,  వేద పండితులు ఎనమండ్ర రవిప్రకాష్ శర్మ అవదాని,  జిల్లా కలెక్టర్ కు ఆశీర్వచనాలు అందజేశారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.  కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలతో సరికొత్త ఆనందాలతో అందరి జీవితాలు వెలుగొందాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కు శుభాకాంక్షలు తెలియజేసినవారిలో ఉప రవాణా కమీషనరు ఎస్. శాంతకుమారి, ద్వారకాతిరుమల దేవస్ధానం ఈఓ వేండ్ర త్రినాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జివివి సత్యనారాయణ, కె. బాబ్జి, డిపిఓ తూతిక. విశ్వనాధ్ శ్రీనివాస్, జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, హౌసింగ్ పిడి రవికుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వై. రామకృష్ణ, ఆర్ అండ్ బి ఎస్ ఇ జాన్ మోషే, ఆర్ డబ్య్యూఎస్ ఎస్ ఇ  సత్యనారాయణ, ట్రాన్స్ కో ఎస్ ఇ సాల్మన్ రాజు, నగరపాలక సంస్ధ కమీషనరు ఎస్. వెంకటకృష్ణ, మెప్మా పిడి ఇమ్మానియేల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ గోపాలకృష్ణమూర్తి, ఎల్ డిఎం నీలాధ్రి, డిప్యూటీ సిఇఓ విజయలక్ష్మీ, బి.సి. కార్పోరేషన్ ఇడి పుష్పలత, జిల్లా బి. సి. సంక్షేమాధికారి ఆర్. నాగరాణి, డిసిహెచ్ పాల్ సతీష్ కుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి ఎన్ఎస్ కృపావరం, డిసిసిబి సిఇఓ శ్రీదేవి,  సెట్ వెల్ సిఇఓ యండి మెహరాజ్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఆర్.వి.ఎస్. రామచంద్రరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి సిహెచ్ కె. దుర్గాప్రసాద్ లింగం,  పౌర సరఫరాల శాఖ డిఎం మంజూ బార్గవి, డిఎస్ ఓ ఆర్ ఎస్ ఎస్ రాజు, ఉధ్యాన శాఖ డిడి రామ్మోహన్, సోషల్ వెల్పేర్ జెడి జయప్రకాష్, పొల్యూషన్ ఇఇ వెంకటేశ్వరరావు, పశు సంవర్ధకశాఖ జెడి జి. నెహ్రూబాబు, ఈపిఎంఐపి పిడి రవికుమార్,  ఎన్ ఐసి శర్మ,  ఏలూరు తహశీల్దారు బి. సోమశేఖర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయ, ఐసిడిఎస్ పిడి పద్మావతి, సిపిఓ శ్రీనివాసరావు, డిసిపిఓ సూర్యచక్రవేణి, తదితరుల కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

About Author