పేరుకే బాధ్యతలు..అందని పౌష్టికాహార సేవలు …
1 min readఅంగన్ వాడీలో లబ్ధిదారులకు కలగానే.. -పిల్లలకు ఆటా లేదు..పాటా లేదు.. -కేంద్రాలకూ ఎప్పుడూ తాళాలే.. –
పర్యవేక్షణ లేకపోతే ఎలా అందేనూ సేవలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నారులకు ఆటలు లేవు పాటలు లేవు..గత 25 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకులు వారి సమస్యల పరిష్కారం కొరకు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. వారు ధర్నా చేస్తుండడంతో గ్రామాల్లో ఉన్న బాలింతలకు గర్భవతులకు చిన్నారులకు కేంద్రాల్లో ఉన్న పౌష్టికాహార సేవలు ఆగకూడదు సేవలు వారికి అందించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం సచివాలయాల్లో పనిచేస్తున్న ఒక్కొక్కరికి ఒక్కో అంగన్వాడీ కేంద్రాన్ని బాధ్యతలు అప్పగించారు.అంతే కాకుండా సిబ్బంది తక్కువగా ఉన్న చోట గ్రామైక్య పొదుపు సంఘాలకు ఈ బాధ్యతలను అధికారులు అప్పగించారు.కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న గర్భవతులు బాలింతలకు గుడ్లు పాలు బియ్యం కందిపప్పు ఆయిల్ వైయస్సార్ కిట్లు అటుకులు రాగి పిండి ఖర్జూరాలు బెల్లం చిక్కిలు మొదలగునవి వీరికి ప్రభుత్వం అందిస్తూ ఉండేది.అంతే కాకుండా 7 నెలల నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు బడికి వచ్చే పిల్లలకు రోజు వారి మెనూ గుడ్లు పాలు మరియు భోజనాన్ని అందించేవారు.కానీ నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 42 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా బాధ్యతలు తీసుకున్న అధికారులు కేంద్రాలను తెరచి లబ్ధిదారులకు చేరవలసిన పౌష్టికాహార సేవలు అన్నీ కూడా లబ్ధిదారులకు చేరవలసిన బాధ్యత అధికారులది..కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ పౌష్టికాహార సేవలు ఎవ్వరికీ అందడం లేదని అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారోనని కేంద్రాలు ఎప్పుడు చూసినా తాళాలు వేసే ఉంటాయని ఆయా గ్రామాల లబ్ధిదారులు మహిళలు బాధ్యతలు తీసుకున్న అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు లబ్ధిదారులకు పౌష్టికాహార సేవలు అందే విధంగా కేంద్రాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా తెరిచే విధంగా చూడాలని వారు కోరుతున్నారు.మరి రాబోయే రోజుల్లో సేవలు అందుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే..అంతే కాదు అంగన్వాడీ కార్యకర్తలు ఐదవ తేదీ లోపు సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.హాజరుకాని పక్షంలో చర్యలు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.