మానవ అక్రమ రవాణా వ్యతిరేకత పై అవగాహన సదస్సు
1 min readజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం కర్నూలు నగరంలోని స్థానిక జిల్లా కోర్టులోని లోక్ అదాలత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డి.ఎల్.ఎస్.ఏ సెక్రటరీ శ్రీనివాస్, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ హరినాథ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటలక్ష్మి, డి.ఎస్.పి ఐ. సుధాకర్ రెడ్డి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎస్.మనోహరు పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో డి.ఎల్.ఎస్.ఏ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అతిపెద్ద నేరాల్లో ఒకటని వీటిని సమాజంలో నుంచి తీసివేయాలంటే ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని అప్పుడే మానవ అక్రమ రవాణా అడ్డుకట్టగా వేయగలమని అన్నారు, అలాగే మానవ అక్రమ రవాణా నిర్వహిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డి ఎల్ ఎస్ ఏ చీఫ్ లీగల్ అడ్వైజర్ మనోహర్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నిర్మూలించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 21, 23, 23(1), 39, 39ఏ , 42, 43, 45, 47, ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్స్ 339 నుంచి 342, 359 మంచి 377 , జువెనైల్ జస్టిస్ ఆక్ట్ నుంచి సెక్షన్ 23, 24, 25 మరి కొన్ని చట్టాలు వీటిని అరికట్టేందుకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, న్యాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.