PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆన్లైన్ సేవ పోర్టల్ బ్రౌచర్లను ఆవిష్కరించిన జాయింట్​ కలెక్టర్​

1 min read

నిరుద్యోగ యువతీ యువకులందరూ ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆన్లైన్ సేవ  పోర్టల్ ద్వారా ఆన్లైన్  సర్వీసులు సద్వినియోగం చేసుకోండి

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నిరుద్యోగ యువతీ యువకులందరూ ఉపాధి మరియు శిక్షణ శాఖ ఆన్లైన్ సేవ  పోర్టల్ ద్వారా  ఆన్లైన్  సర్వీసులు సద్వినియోగం  చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.శుక్రవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో  జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఉపాధి మరియు శిక్షణ శాఖకు సంబందించిన  ఆన్లైన్ సేవ పోర్టల్ బ్రౌచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేOజిలు /మోడల్ కెరీర్ సెంటర్లు ద్వారా అందచేయబడు సేవలన్నిటిని భారత ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) పోర్టల్ తో ఆన్లైన్ (Online)లో అనుసంధానించడమైనదన్నారు.. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ రెన్యూవల్ మరియు అదనపు అర్హతలు నమోదు అన్ని సులభరీతిన  ఎంప్లాయిమెంట్ employment.ap.gov.in  ద్వారా ఆన్లైన్ సేవలు అందజేయబడుచున్నాయనీ, అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన యెడల వారికి లాగిన్ వివరములు మరియు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా చరవాణి కి పంపబడుతుందని, సంబంధిత జిల్లా ఎంప్లాయిమెంట్  అధికారి వారి అభ్యర్థనను ఆమోదించిన యెడల వారికి ఎస్ఎంఎస్ ద్వారా ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియజేయబడునన్నారు.. తదనంతరం తన ఎంప్లాయిమెంట్ కార్డు లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కూడా కల్పించడం జరిగిందన్నారు. కావున నిరుద్యోగ యువతీ యువకులందరూ ఈ పోర్టల్ నందు ఆన్లైన్ సర్వీస్ లను ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారిని పి.దీప్తి, సిబ్బంది నరసింహులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

About Author