PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూ కబ్జాకోరుల కోసమే… భూ యజమాన్య హక్కు చట్టం

1 min read

భూ యజమాన్య హక్కు చట్టం 2023

జీవో కాపీలను భోగిమంటల్లో దగ్ధం చేయాలని రైతు సంఘం  పిలుపు                                           

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యజమాన్య హక్కు చట్టం 2023  జీవో కాపీలను భోగి పండుగ రోజు భోగిమంటల్లో దగ్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. రాష్ట్ర సమితి పిలుపు మేరకు శనివారం పత్తికొండలో స్థానిక చదువులు రామయ్య భవనం నందు  జీవో కాపీలను చూపిస్తూ దగ్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డి రాజా సాహెబ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు భీమ లింగప్ప రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పెద్ద ఈరన్న ఉమామహేశ్వరరావు రైతు సంఘం మండల నాయకులు పి రామనాయుడు పాపన్న పెద్దమని తో కలిసి జీవో కాపీలను చూపిస్తూ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని కేవలం భూ కబ్జాకోరుల కోసమే తెచ్చారని, ప్రజలు భయపడుతూ చట్టంలో ఉన్న నిబంధనలు భూమి తగాదాలు వచ్చినప్పుడు స్థానిక రెవెన్యూ అధికారులు పక్షపాతి ధోరణి అవలంబించినప్పుడు సామాన్య రైతులు నష్టపోతారని, రెవిన్యూ అధికారులే జడ్జిమెంట్  ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో అధికార పార్టీ జోక్యం రెవెన్యూవస్థలో మితిమీరి  పోయిందని, అలాంటప్పుడు ఆపోజిట్ గా ఉన్న రైతుకు నష్టం జరుగుతుందని అలాంటప్పుడు కోర్టు ఎందుకు జోక్యం చేసుకోకూడదని అన్నారు. ఈ జీవో తీసుకోవడం ద్వారా ఏమాత్రం రాజకీయ పలుకుబడి లేని భూ యజమానులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. రైతులకు భూమి హక్కు పత్రాలు ఉన్నా లేదని రెవిన్యూ అధికారులు తీర్పు ఇచ్చి ఒకపక్క మొగ్గు చూపే అవకాశం ఉందని అలాంటప్పుడు ఆ రైతు తన దగ్గర ఉన్న భూమి హక్కు ఆధారపత్రాలతో కోర్టును ఆశ్రయించి న్యాయం పొందే హక్కును కాలరాసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం భూ కబ్జాలకు పాల్పడే అధికార పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టె ప్రయత్నం తప్ప మరొకటి కాదని వారు విమర్శించారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కాపీలను భోగిమంటల్లో వేసి దగ్ధం చేయాలని, ఈ నిరసన కార్యక్రమాల్లో రైతులు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.

About Author