“ప్రధానమంత్రి జన్ మన్” కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రధానమంత్రి జన్ మన్” కార్యక్రమం లో భాగంగా తేదీ 15.01.2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా PVTG చెంచు ప్రజలతో ప్రత్యక్ష ప్రసారము (విర్చువల్ మోడ్) ద్వారా ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రత్యక్ష ప్రసారము చేయుటకు నెరవాడ గురుకుల పాఠశాల ప్రాంగణంలో వేదిక స్థలాన్ని ఐటిడిఏ శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారి డాII బి. రవీంద్ర రెడ్డి పరిశీలించి స్కూలు సిబ్బందికి పలు సూచనలు తెలియజేయటం జరిగింది. వారితో పాటుగా శ్రీ. ఆర్.జె కచప్ , జనరల్ మేనేజర్, MoTA, న్యూడిల్లీ వారు, శ్రీ K. వెంకట శివ ప్రసాద్ , జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి, నంద్యాల్ జిల్లా వారు శ్రీమతి లతా , EE, ఐటిడిఏ శ్రీశైలం వారు, శ్రీ సి. ప్రదీప్ , AEE, ఐటిడిఏ శ్రీశైలం వారు,ఐటిడిఏ ప్రాజెక్ట్ మేనేజర్ కె. జి. నాయక్, పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి మేరి సలోమి , MGNREGS సిబ్బంది మరియు స్కూలు సిబ్బంది పాల్గొనడం జరిగింది.