నగరమా మేలుకో కార్యక్రమంతో ప్రతి ఒక్కరిలో చైతన్య తీసుకొచ్చాం..
1 min readకర్నూల్ టిడిపి ఇంఛార్జీ టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలో తాము చేపట్టిన తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమంతో ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చామని కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టి.జి భరత్ అన్నారు. నగరంలోని 52వ వార్డులో చివరి రోజు నగరమా.. మేలుకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి టిడిపి సూపర్ 6 పథకాలు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూల్ నగరంలోని 33వ వార్డుల్లో ‘నగరమా.. మేలుకో’ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందన్నారు. వార్డులోని ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. టీడీపీ పథకాలను వివరించినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రజల ఆదాయం పెరగాల్సిందిపోయి.. ఖర్చులు పెరిగిపోయాయని భరత్ అన్నారు. నగరంలోని ఏ వార్డుకు వెళ్లినా ప్రజలు సమస్యలు చెబుతున్నారని అన్నారు. వార్డుల్లో పారిశుధ్యం పడకేసిందని.. మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్నారు. బుధవారపేటలో సెప్టిక్ ట్యాంక్లోపడి మహిళ చనిపోయిన ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు.. మౌలిక సదుపాయలు కల్పించడంలో విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. పారిశుధ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన అసెంబ్లీ ఇంఛార్జీ ఆర్షద్, టిడిపి సీనియర్ నేతలు బొల్లెద్దుల రామకృష్ణ, పోతురాజు రవి, అబ్బాస్, మన్సూర్ ఆలీఖాన్, రామాంజనేయులు, గున్నా మార్క్, నరసింహులు, ఆర్య శంకర్, నాగన్న, శ్రీనివాసులు, పవన్, జనసేన నేతలు నాగరాజు, మహిళా నాయకురాళ్లు మారుతి శర్మ, సౌభాగ్యమ్మ, విజయలక్ష్మి, అనిత, రేష్మా భాయ్, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.