PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాక్షన్ జిల్లాలో సేవారత్నం.. సాయినాధుడే ఆణిముత్యం

1 min read

“*సేవారత్న”” బిరుదు తో నిరుపేదల సేవకుడు 

అవార్డ్ ఆత్మీయులకు అభిమానులకు అంకితం 

ప్రాణాలు కాపాడిన ప్రాణనాధుడు సాయి నాధుడు 

సాయినాథ్ శర్మకు ఢిల్లీలో డాక్టరేట్, సేవారత్న అవార్డు ప్రధానం

పల్లెవెలుగు వెబ్ కడప : ఫ్యాక్షన్ కు కక్షలు కార్పణ్యాల కు నిలయమైన కడప జిల్లాలో నిరుపేదల సేవలో మకుటం లేని మహోన్నతుడుగా నిస్వార్థ ప్రజాసేవే లక్ష్యంగా తనదైన శైలిలో దూసుకుపోతున్న కమలాపురం నియోజకవర్గం ప్రజానాయకుడు నిరుపేదల సేవకుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ కరోనా సమయంలో చేసిన సేవలకు ప్రతీకగా కేంద్ర ప్రభుత్వ నీతి అయోగ్ సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ ఐకానిక్ పీస్ కౌన్సిల్ ఆద్వర్యంలో డాక్టరేట్ అవార్డ్ తో పాటు సేవా రత్న బిరుదు ను న్యూఢిల్లీలోని కాన్సిట్యూషనల్ క్లబ్ లో టిబెట్ దేశపు ఉపాద్యక్షుడు ఆచార్య యేషి ప్రధానం చేసారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశం లో విశిష్ట అతిథిగా కేంద్ర ప్రభుత్వం తరపున టిబెట్ దేశపు ఉపాధ్యక్షుడు ఆచార్యా యేషి విచ్చేసారు.ఎంతో ప్రతిష్ఠాత్మకమైన అత్యంత ప్రధానమైన ఈ అవార్డ్ 2023వ సంవత్సరానికి గాను సాయినాథ్ శర్మ ఎంపిక కావడం ఆయన నిస్వార్థ ప్రజా సేవా నిరతకి నిదర్శనంగా నిలుస్తోంది . ఎం కామ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను న్యాయ విద్యను అభ్యసించిన సాయినాథ్ శర్మ సమాజ సేవ లక్ష్యంగా పనిచేస్తూ అనేకమంది యువతను సైతం సమాజసేవ వైపు దృష్టి మరల్చేలా కృషి చేసారు. చిన్నతనం నుంచి సమాజసేవే తన లక్ష్యంగా సాయినాథ్ శర్మ పని చేసేవారు. 1996వ సంవత్సరంలో కడప జిల్లా ఉత్తమ యువజన అవార్డుతో పాటు 1998 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డు కూడా సాయినాథ్ శర్మ సేవలకు లభించింది. తన దగ్గరికి ఎవరు వచ్చి సహాయం అడిగినా ఆర్తులకు ఆపన్న హస్తం అందించే ఆపద్బాంధవుడిగా కమలాపురం ప్రాంతంలో సాయినాథ్ శర్మ కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సాయినాథ్ శర్మ సేవలను ఈ ప్రాంత ప్రజలు రాజకీయాలకు అతీతంగా ప్రశంసిస్తూ ఉండడం గొప్ప విశేషం.. సహజంగా సమాజ సేవ పట్ల ఎంతో ఆసక్తి కలిగిన సాయినాథ్ శర్మ కరోనా కష్టకాలంలో మొదటి విడతలో ప్రతిరోజు మూడు వేల నుంచి నాలుగు వేల మంది ఆసరా లేని అన్నార్తులకు ఆకలి దప్పులు తీర్చి పేద ప్రజల గుండెల్లో ఆకలితీర్చే ఆత్మీయుడిగా ఆరాదింపపడ్డారు. మొదటి విడత కరోనా లో ఇంటి నుంచి బయటకి రావాలంటేనే భయపడి ఇంటిలోనే ప్రజలు ఉండిపోయే పరిస్ధితుల్లో సాయినాథ్ శర్మ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అయన అభిమానులు ఆత్మీయులు ధైర్యంగా బయటికీ వచ్చి ఆకలితో అలమటిస్తున్న అనేకమంది కి ఆకలి బాధలు తీర్చడం అప్పట్లో ప్రజల గుండెల్లో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. కొందరు వృద్ధులు రోడ్ పక్కన ఫుట్ పాత్ పై అకలితో పడిపోయి తినలేని స్థితిలో ఉన్న వారికీ దగ్గర ఉండి తినపించిన సేవా ఘనత కూడ సాయినాథ్ శర్మ కు ఉండడం ఆయన మంచి గుణానికి నిదర్శనం. అలాగే కరోనా రెండవ విడత లో తన సొంత నిధులతో చెన్నై నుంచి 75 ఆక్సిజెన్ సిలెండర్స్ ఐదు ఆక్సిజెన్ కాన్సంట్రేటర్స్ కొని ఉచితంగా ప్రజలకు అందించి కడప జిల్లాలో ప్రాణదాత గా ప్రజల హృదయాలలో సుస్థిరంగా నిలిచిపోయారు. కరోనా రెండవ దశలో తాను స్వయానా డాక్టర్ కాకపోయినా తన సేవాబావంతో ఉచితంగా ఆక్సిజన్ సిలెండర్స్ పంపిణీ చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన సాయినాథ్ శర్మ సేవలకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి డాక్టర్ అవార్డ్ ఇవ్వడం తో ప్రాణాలు కాపాడిన డాక్టర్ గా సాయినాథ్ శర్మ ను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం చాలామంది సమాజ సేవకులకు ఆదర్శంగా నిలుస్తుందనడం లో ఎటువంటి సందేహం అవసరం లేదు. న్యూఢిల్లీ లోని కాన్సిట్యూషనల్ క్లబ్ లో కేంద్ర ప్రభుత్వ జాతీయ అంతర్జాతీయ ఉన్నతాధికారుల ప్రపంచం లోనే ప్రఖ్యాతి కాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ జాయింట్ రిజిస్టార్ సైమన్ లూసియానా సమక్షంలో సాయినాథ్ శర్మ కు ఈ అవార్డ్ ప్రదానం చేసారు. బంగారు పూతతో ప్రశంసాపత్రం ప్రదానం చేయడం ఈ అవార్డ్ ప్రత్యేక విశిష్టత. ఈ సందర్భంగా అవార్డ్ ప్రదానోత్సవం లో సాయినాథ్ శర్మ మాట్లాడుతూ తాను అవార్డ్ లు వస్తాయని పనిచేయలేదని కరోనా కష్ట కాలంలో మొదటి విడతలో ఆకలి తో అలమటించే వారికి అన్నం పెట్టడం రెండవ విడత లో ఆక్సిజన్ అందక అలమటించే అనేకమంది నిరుపేదలకు ఉచితంగా ఆక్సిజెన్ సిలెండర్స్ అందించి తన చేతనైనంత వరకు ప్రాణాలు కాపాడడం సామాజిక వ్యక్తీగత బాధ్యత అని గుర్తించి పనిచేసానన్నారు.తాను చేసిన ఈ సేవ ప్రజలకు ఉపయోగపడదానికి తన అభిమానులూ ఆత్మీయులు కుటుంబ సభ్యులు ఎంతోమంది ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పనిచేసారని వారందరి కృషి ఈ అవార్డ్ కు కారణమన్నారు అందుకే నా అభిమానులకు ఆత్మీయులకు ఈ అవార్డ్ ను అంకితం ఇస్తున్నానన్నారు.

About Author