PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకి బోయల ఆత్మ గౌరవ రిలే నిరాహార దీక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద : ఆలూరులో 04వ రోజు చేరుకున్న వాల్మీకుల ST సాధన  కోసం_ ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం(APVBS) కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు హోళగుంద మండల వాల్మీకి బోయ యువ నాయకులు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చోవడం జరిగింది.ఈ సందర్భంగా పెద్దహ్యట పి.శ్రీరంగ దిడ్డి తిక్కస్వామి మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన కూడా బోయ వాల్మీకులకు మాత్రం స్వాతంత్రం రాలేదు ఎందుకంటే ఎటువంటి కులావృత్తి లేని బోయ వాల్మీకులుగా ఈ దేశంలో జీవనం కొనసాగిస్తున్నారు. విద్య ఉపాధికి నోచుకోరి బోయ వాల్మీకులు ఉన్నంత విద్య చదవాలన్న ఉన్నత స్థాయికి జీవన ఉపాధి కోసం ఎదగాలన్న ఎస్టీ సాధన ఏకైక మార్గం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలిపిస్తామంటూ వైఎస్ఆర్సిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్ట మొదటి అసెంబ్లీలోని బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తా మని హామీ ఇచ్చి నాలుగున్నర సంవత్సరాలు  గడుస్తున్న ఇప్పటికీ  తీర్మానం జరగలేదు.కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తామంటూ సాక్షాత్తు నరేంద్ర మోడీ  పిఎం గారు హామీ ఇచ్చారు కానీ ఇచ్చిన మాట హామీలకే పరిమితం అవుతుంది కానీ బోయ వాల్మీకులను గుర్తించి ఎస్టి రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బోయ వాల్మీకులు అందరూ ఏకతాటిగా వచ్చి ఈ ప్రభుత్వాలకు పాడె కడతామని ఈ సభాముఖంగా వారు హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దహ్యట వీరేష్ రారాయి సిద్దు హైకల్ మల్లికార్జున పులి మల్లయ్య శ్రీను వెంకటేష్ మల్లి మహేశ్ బోయ వాల్మీకి కుల బంధువులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author