కొత్త వైరస్ .. 3 రాష్ట్రాల్లో డెల్టాప్లస్ !
1 min readపల్లెవెలుగు వెబ్: దేశ వ్యాప్తంగా కరోన వైరస్ కేసులు సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అన్ లాక్ ప్రక్రియ మొదలవుతోంది. అయితే… కేసులు తగ్గుతున్నప్పటికీ వైరస్ ముప్పు పొంచి ఉందని వైద్య రంగ నిపుణలు హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్.. డెల్టా ప్లస్ గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ ను కేంద్రం .. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా గుర్తించింది. దీని ప్రభావాన్ని అంచనా వేసే పని లో ఉన్నారు. దీని ప్రభావాన్ని బట్టి ఆందోళనకర వేరియంట్ గా గుర్తించాలో లేదో నిర్ణయిస్తారు. అయితే.. డెల్టా ప్లస్ వేరియంట్ మూడు రాష్ట్రాల్లో పాకినట్టు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, కేరళలో డెల్టా ప్లస్ వేరియంట్ పాకినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 21 కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. ఈ వేరియంట్ ద్వార మహారాష్ట్రలో మూడో దశ కరోన ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర వైద్య శాఖ ఇప్పటికే అంచనా వేసింది.