ఏఐఎస్ఎఫ్ నూతన 2024 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
1 min read– హోళగుంద మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ స్టేషన్లో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను హోళగుంద మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ డేవిడ్ సార్ చేతుల మీదగా మరియు హోళగుంద మండల పోలీస్ స్టేషన్లో ఏ.ఎస్ఐ.శ్రీనివాసులు సార్ గారి చేతుల మీదుగా మరియు హోళగుంద మండల జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నజీర్ అహ్మద్ సార్ చేతుల మీదుగా ఏఐఎస్ఎఫ్ నూతన సంవత్సర 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ సమరశీల విద్యార్థి ఉద్యమాల రథసారథి భారతదేశ విద్యార్థి లోకానికి స్ఫూర్తిని చైతన్యాన్ని కలిగించి సంఘటిత శక్తిగా ముందుకు నడిపించే చోదకశక్తి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ బ్రిటిష్ పరాయి పాలకుల బానిస చెర నుంచి మాతృభూమి విముక్తికై విరోచత స్వాతంత్ర ఉద్యమాలలో పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని చాటింది. భారతదేశ విద్యార్థి లోకాన్ని ఏకం చేసి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో పుట్టి పెరిగి అశేష త్యాగాలు చేసి సుదీర్ చరిత్ర కలిగిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ అని తెలియజేయడం జరిగింది.ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో కార్యక్రమంలో హోళగుంద మండల పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది మరియు జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది మరియు ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు కాకి గాదిలింగ ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శిలు ఉపాధ్యక్షులు భీమేష్ హనుమంతు మల్లి అజయ్ శామిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.