పది .. ఇంటర్ పరీక్షలకు నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు చేసుకోండి
1 min readఆరోగ్యశ్రీ , ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రజలకు అంద చేయండి…
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జగనన్న ఆరోగ్య సురక్ష కార్డులు మరియు ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రజలకు అందజేయలని,అంగన్వాడి నుండి అంద వలసిన సౌకర్యాలు గర్భిణీలకు , పాలిచ్చే తల్లులకు , పిల్లలకు అందే చర్యలు, పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినారు.గురువారం సాయంకాలం వివిధ ప్రభుత్వ పథకాల అమలు పై అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి సమీక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జగనన్న అరోగ్య సురక్ష మొదటి విడత పూర్తి అయ్యిందని సదరు క్యాంపులలో నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేయబడ్డ వారిని సంబంధిత ఆసుపత్రులకు తీసుకెళ్లి వారికి వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంటి కాట్రాక్ట్ సర్జరీలకు సంబంధించి అన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంటి అద్దాలు కూడా అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. . జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత క్యాంపులు 7 రోజుల ముందు ఒకసారి, 3 రోజుల ముందు ఒకసారి గ్రామ వాలంటీర్ల, వార్డు వాలంటీర్ల చేత విస్తృత ప్రచారం జరిగేలా ఎంపిడిఓలు, పంచాయతీ సెక్రటరీలు చర్యలు తీసుకోవాలన్నారు.ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ మరియు ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ కూడా వెంటనే చేయించాలని ఆదేశించినారు. ఫిబ్రవరి 9న జరిగే డి వార్మింగ్ డే ( నులిపురుగుల నివారణ దినం ) కొరకు అంగన్వాడీ కేంద్రాలు మరియు ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు అందరికీ ఆల్బెండజోల్ మందులు సరఫరా చర్యలు చేపట్టాలని ఆదేశించినారు.అంగన్వాడి సిబ్బంది ద్వారా గర్భిణులకు , పాలిచ్చే తల్లులకు , పిల్లలకు అందవలసిన సౌకర్యాలు టేక్ హోమ్ రేషన్ , పాలు , గుడ్లు , బియ్యం , నూనె పప్పు దినుసులు అందజేసే ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.అన్ని పోలింగ్ స్టేషన్లో మురుగుదొడ్లు , కరెంటు , త్రాగునీరు , సెక్టోరియల్ అధికారులు , పోలీసుల ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.ఇంటర్మీడియట్ వ్రాత పరీక్షలు మార్చి ఒకటో తారీకు నుండి మరియు పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18వ తారీకు నుండి ప్రారంభం కానుండటం చేత సిబ్బంది , పోలీసు సిబ్బంది , వైర్లెస్ సెట్లు , ఫర్నిచర్ మొదలగు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని , ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన క్యాంపు కార్యాలయం నుండి,జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య కలెక్టరేట్ కార్యాలయం నుండి పాల్గొన్నారు , జిల్లా స్థాయి అధికారులు వీడియో లింకు ద్వారా పాల్గొన్నారు.