హోళగుంద మండల వ్యాప్తంగా కరువు సహాయక చర్యలు చేపట్టాలి
1 min read– పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు నగుదును జమ చేయాలని కోరుతూ.
– ఈ రోజు CPI జిల్లా సమితి పిలుపు మేరకు హోళగుంద మండల తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది.
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా CPI మండల కార్యదర్శి మారెప్ప మాట్లాడుతూ_* కర్నూల్ జిల్లాలో సిపిఐ నిర్వహించిన పోరాటాల ఫలితంగా 24 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.కానీ కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది దీని కారణంగా రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నది జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 20 మందికి పైగా రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది ఏ సీజన్లో రైతులు పంటలు నష్టపోతే ఆ సీజన్లోనే పంట నష్టపరిహారం ఇస్తామని ప్రచారం చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరువు మండలాలపై పంట నష్టపరిహారం పై నోరు మెదపడం లేదు. దీని కారణంగా రైతులకు ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నది తక్షణమే జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు నగదును జమ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈ రోజు సిపిఐ ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.
డిమాండ్స్
1.జిల్లా వ్యాప్తంగా కరువు సహాయక చర్యలు చేపట్టాలి.
2.పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పత్తి వేరుశనగ ఆముదము కంది జొన్న కొర్ర సజ్జ పంటలకు ఎకరాకు 40 వేల రూపాయలు, పంట నష్టపరిహారం రైతుల ఖాతాలకు నగదును జమ చేయాలి.
3.ఉల్లి మిర్చి ఉద్యానవన పంటలకు 1లక్ష రూపాయలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి.
4.జిల్లాలో ఏర్పడిన త్రాగునీటి సమస్య కు యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి పరిష్కరించాలి.
ఈ కార్యక్రమంలో AISF జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ రైతు సంఘం నాయకుడు కృష్ణ సిపిఐ నాయకులు రైతు సంఘం నాయకులు ఇనహిత్ సలాం సబ్ అబ్దుల్లా యూసుఫ్ వెంకన్న అమీర్ తదితరులు పాల్గొన్నారు.