‘మలబార్ ఇన్వెస్టిమెంట్స్’.. డీఐఎఫ్సీలోకి బదిలీ…
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రపంచ వాణిజ్యరంగంలో తనదైన ముద్ర వేసుకున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ యొక్క అంతర్జాతీయ పెట్టుబడి విభాగమైన మలబార్ ఇన్వెస్టిమెంట్స్ కార్యకలాపాలను దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డీఐఎఫ్సీ)కి బదిలీ చేశారు. డీఐఎఫ్సీ గవర్నర్ మరియు డీఎఫ్ఎం చైర్మన్ ఎక్స్లెన్సీ ఎస్సా కాజీమ్ సమక్షంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం.పీఅహమ్మద్ నాస్టాక్ దుబాయ్ మార్కెట్ వేడుకను ప్రారంభించారు. ఈ మేరకు ఆ సంస్థ కర్నూలు షోరూం హెడ్ ఫయాజ్, మార్కెటింగ్ మేనేజర్ నూర్వుల్లా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మలబార్ ఇన్వెస్టిమెంట్స్ అంతర్జాతీయ కార్యకలాపాల షేర్లు నాస్టాక్ దుబాయ్ యొక్క సెంట్రల్ సెక్యురిటీస్ డిపాజిటరీ (సీఎస్డీ)లో రిజిష్టర్ చేయబడ్డాయని, ఈ ఘట్టం పెట్టుబడిదారులతో సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆకాంక్షించారు. కంపెనీ వాటాలకు సంబంధించి కార్పొరేట్ కార్యకలాపాలు పారదర్శకంగా… నియంత్రణతో .. సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు.