గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు యువత శిక్షణా కేంద్రం..
1 min read(వై టి సి), కే. ఆర్. పురం, నందు డే-స్కాలర్ (నాన్ రెసిడెన్షియల్)
విధానంలో ఎస్ జి టి పోస్టులకు శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
ఐటిడిఏ పివో యం. సూర్యతేజ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కె అర్ పురం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు డి ఎస్ సి ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో ఐ.టి.డి. ఎ, కె.ఆర్.పురం పరిధిలో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు యువత శిక్షణా కేంద్రం (వై టి సి), కే. ఆర్. పురం, నందు డే-స్కాలర్ (నాన్ రెసిడెన్షియల్) విధానంలో ఎస్ జి టి పోస్టులకు శిక్షణ ఇచ్చుట కొరకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటిడిఏ పివో యం. సూర్యతేజ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఏజెన్సీ పరిధిలో ఆసక్తి గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు వై టి సి, కె.ఆర్. పురం నందు ది.16-02-2024 లోపుగా ధరఖాస్తు చేసుకోవలసినదిగ ఆయన తెలిపారు.కోచింగ్ క్లాసులు ది.17-02-2024 నుండి ప్రారంబించబడతాయని, కావున దరఖాస్తు కొరకు అభ్యర్థులు వారి ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం మరియు డి ఏస్ సి రిజిస్ట్రేషన్ స్లిప్ తో మేనేజర్ వై టి సి కె. ఆర్. పురం (ఫోన్ నెం-9490285277) వారిని సంప్రదించాలన్నారు.