PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటింటికి కుళాయి..స్వచ్ఛమైన త్రాగునీరే లక్ష్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పనుల నిర్వహణలో కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతి పైన అవగాహన సదస్సును ఎంపీడీఓ గంగావతి ఆధ్వర్యంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్డబ్ల్యూఎస్&ఎస్ వి.అమల అధ్యక్షతన శుక్రవారం అధికారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్ జిల్లా ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగం జిల్లా సమన్వయ కర్త వి. భీమశంకర్ రెడ్డి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనుల నిర్వహణకు గ్రామ స్థాయిలో గ్రామ జల సంఘాలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతి ద్వారా పనులను నిర్వహించి ప్రతి ఇంటికి తాగునీటి కులాయిని ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీరును అందించడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమైనది.ఈ పద్ధతి ద్వారా పనులను అమలు చేయడంలో గ్రామీణ నీరు మరియు పారిశుద్ధ్య శాఖ విభాగం నోడల్ ఏజెన్సీగా ఉండి పనులను పర్యవేక్షణ చేయడం మరియు పూర్తి చేయడం జరుగుతుంది. గ్రామీణ జల సంఘం ఏర్పాటులో భాగంగా 9 మంది డ్వాక్రా మహిళలు సభ్యులు గాను స్థానిక ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెంబర్ కన్వీనర్ గాను మరియు పంచాయతీ సెక్రెటరీ ఎక్స్ అఫిషియో గాను ఉంది కమిటీని ఏర్పాటు చేసుకుని జెజెఎం పనులను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు .  అంతేకాకుండాజల జీవన్ మిషన్ పనుల ప్రాముఖ్యత పనులలో గ్రామ జల సంఘాల పాత్ర మరియు చేయవలసిన పనుల గురించి గ్రామ జల సంఘాల బాంక్ ఖాతా పనుల పర్యవేక్షణ విధానము గ్రామ జల సంఘాల విధులు మరియు బాధ్యతల గురించి ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో  ఆర్డబ్ల్యూఎస్&ఎస్ అసిస్టెంట్ ఏఈ విశ్వనాథ్,పంచాయితీ కార్యదర్శులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

About Author