వాహనదారులు.. రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి
1 min readమద్యం సేవించి వాహనం నడిపితె 6 నెలలు లైసెన్స్ రద్దుకారాగార శిక్ష ఉంటుంది..
బస్సు డ్రైవర్లతో మాసోత్సవాలలో అవగాహన సదస్సు
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి నాగ మురళి
18 సంవత్సరాల వయసు నిండిన యువతి, యువకులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : నూజివీడు, మద్యం సేవించి వాహనం నడిపేవారి లైసెన్స్ ను 6 నెలలు రద్దు చేయడంతో పాటూ కారాగార శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జి.నాగ మురళి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నూజివీడు ఆర్టీఏ కార్యాలయములో రోడ్డు భద్రత పై విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు, కొత్త లైసెన్సుదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు డ్రైవర్స్, వాహనం నడిపే వారు పూర్తి రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రమాదాలను నివారించే విధంగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి అని, 18 యేళ్ళ వయస్సు నిండినవారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలని, అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడిన వారికి 5000 రూపాయలు నగదు బహుమతి మరియు ఆపద్భాంవుడుగా గుర్తించి సేవా పత్రం అందించడం జరుగుతుందని తెలిపారు నిబంధనలు పాటించని వారు మాత్రమే రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఒక ప్రమాదం జరిగితే మనం, మన కుటుంబ సభ్యులు కూడా చాలా నష్టపోతారని అందువల్ల మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా రోడ్డు భద్రత నియమాలు పాటించిన నాడే ప్రమాదాలను నివారించగలమన్నారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ జి.నాగ మురళి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.