PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చైల్డ్ రైట్స్ అడ్వాకెసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7 జిల్లాలతో సమీక్ష సమావేశం..

1 min read

హాజరైన ఏడు జిల్లాశాఖల అధికారులు

సమయంతో పనిచేస్తూ బాలల హక్కులకు,చట్టాలకు అధికారులు కృషి చేయాలి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక ఆదిత్య ప్రిన్స్ రెస్టారెంట్ ఏలూరు నందు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు రీజన్ నందు ఏడు జిల్లాల బాలలతో పనిచేసే అధికారులకు సమీక్షా సమావేశం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి ఏలూరు జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అధికారి అయిన కెఏవిఎల్ పద్మావతి అధ్యక్షతన వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్  కేశవ అప్పారావు  మరియు ఏపీ ఎస్ సి పి సి ఆర్ సభ్యులు  డాక్టర్. జంగం రాజేంద్ర ప్రసాద్, టి. ఆదిలక్ష్మి  హాజరైయారు.  కమిషన్ తరపున ఏడు జిల్లాల అధికారులందరులు బాలల విషయాలలో సమన్వయంతో పని చేస్తూ బాలల హక్కులను మరియు చట్టాలను అందించడంలో సంబంధిత శాఖల అధికారులoదరు సమిష్టిగా తమ వంతు కృషి చేయాలని అధికారులకు  ఆదేశాలు చేశారు. అలాగే అధికారులందరి సమన్వయంతో పనిచేయడం వల్ల బాలలకు బంగారు భవిష్యత్తును అందించడం ద్వారా బాలలు అభివృద్ధి పదంలో పయనించడానికి అవకాశం ఉంటుందని కమిషన్ తెలియజేసింది. ప్రతి ఒక్క అధికారి బాలల విషయాలలో ఆలంబించాల్సిన విధానాలు తీసుకోవాల్సిన చర్యలను గురించి తెలియజేసారు. ఈ కార్యక్రమoలో ఏలూరు జిల్లా జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సి.హెచ్. సూర్య చక్రవేణి, చైల్డ్ రైట్స్ అడ్వకేసి ఫౌండేషన్ విజయవాడ డైరెక్ట్  ఫ్రాన్సిస్ తంబి, మరియు ఐదు జిల్లాల మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఏడు జిల్లాల నుంచి ఈ గృహ మేనేజర్లు,  డీఇఓ లు, డిస్టిక్ ప్రొవిషన్ ఆఫీసర్స్ , దిశా పోలీస్ ఆఫీసర్స్, జిల్లాల బాలల సంరక్షణ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author