‘అంగన్వాడీ’లను ఉద్యోగులుగా గుర్తించండి…
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలో విలీనం చేయడాన్ని విరమించుకోవాలని, అంగన్వాడీవర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ఏపీ అంగన్వాడీ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకురాలు ఛాయాదేవి. శుక్రవారం కర్నూలు జిల్లా ఆస్పరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి మునుస్వామి, మండల కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, అంగన్వాడీ వర్కర్స్, ఆయాల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని , 2020 నూతన విద్యావిధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రమీల, ఆదిలక్ష్మి, చిట్టెమ్మ, పద్మావతి, సిపిఐ సీనియర్ నాయకులు ఉరుకుందప్ప, బ్రహ్మయ్య, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.