వాణిజ్య అవసరాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాడకం..
1 min readనిర్వహిస్తున్న హోటల్ యజమాని పై చట్ట ప్రకారం కేసు నమోదు
విషయ సమాచారం మేరకు దాడులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లు అందిన సమాచారం మేరకు ఏలూరు సత్రంపాడు లో కరణం కుమార్, రీజినల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి తస్మిక తనిఖీలు నిర్వహించారు. వారికి అందిన సోషనీయ సమాచారం మేరకు వాణిజ్య అవసరాలకు సబ్సిడి గ్యాస్ సిలిండర్లు వాడుచున్నట్లుగా వచ్చినతో సమాచారo ప్రకారం అధికారుల ఆదేశాల మేరకు శాంతినగర్, ఏలూరు లో నిర్వహించుచున్న హోటల్ అమృత నందు తనికీ చేయగా 10 గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడి గ్యాస్) సిలిండర్లు గుర్తించి. హోటల్ యజమాని అయిన బంకపల్లి దుర్గా ప్రసాద్ ను ప్రశ్ని౦చగా అతను వ్యాపార నిమిత్తం గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడి గ్యాస్) సిలిండర్లు తెలిసిన వారి వద్ద రు.50/-లు ఎక్కువగా ఇచ్చి కొనుగోలు చేసి ఆ సిలిండర్లు వాడుచున్నట్లు తెలియచేసారు. ఈ తనికీలో రు.26,665/-లు విలువ కలిగిన 10 గృహ అవసరాల గ్యాస్ (సబ్సిడి గ్యాస్) సిలిండర్లు సీజ్ చేసి హోటల్ అమృత యజమాని అయిన బంకపల్లి దుర్గా ప్రసాద్ పై నిత్యవసరవస్తువుల చట్టం 1955 ప్రకారం కేసు నమోదు చేయడమైనది. ఈ తనికీ నందు విజిలెన్సు ఇన్స్పెక్టర్ పి. శివరామ కృష్ణ, ఎం ఆర్ ఐ ఏలూరు జె. శ్రీను నాయక్ మరియు రెవిన్యూ , సివిల్ సప్లై అధికారులు పాల్గొనడం జరిగినది.