మా పిల్లలను ఉర్దూ బోధనకు దూరం చేయకండి…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : Z.P.H.S హొళగుంద మండలం ఉర్దూ విద్యార్థుల తల్లి దండ్రులు మరియు గ్రామ ముస్లిం మైనారిటీ వారు నమస్కరించి వ్రాసుకున్న విన్నపము ఏమనగా ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లి దండ్రులము Z.P.H.S హొళగుందలొ ఈ సంవత్సరము నుండి C.B.S.E కి అనుసంధానము అయినది కానీ ఇక్కడ నాలుగు మీడియంలలొ ఒకటి ఉర్దూ మీడియం. మా పిల్లలు 1వ తరగతి నుండి ఉర్దూ మీడియంలొ కొనసాగుతూ 6 నుండి 10 తరగతి వరకు Z.P.H.S| హొళగుందలొ చదువుతున్నారు. కానీ ఉన్నట్టుండి అది ఇంగ్లీష్ మీడియంలొ మార్చడం మా పిల్లలకు ఉర్దూ బోధనకు దూరం చేయడం మా అందరికి నష్టం. గతంలొ నాలుగు సార్లు విన్నపము ఇవ్వడం జరిగినది. కలెక్టర్ కి ఒక దరఖాస్తు మీకు మూడు సార్లు దరఖాస్తులు, M.L. Aకి ఒక దరఖాస్తు ఇలా అందరికి ఇవ్వడం జరిగినది. పాఠశాలను ఒక రోజు బంద్ చేయడం, పిల్లలతో M.R.O ఆఫీస్ కి దరఖాస్తు చేయడం జరిగినది. ఈ విషయం రోజూవారి దిన పత్రికలు. ఇంగ్లీష్ పత్రికలలొ కూడా రావడం జరిగినది. కానీ ఇప్పటి వరకు మాకు ఏ ||విధమైన సమాచారం రాలేదు. కానీ 2024-2025 నుంచి Z.P.H.S హొళగుందలొ అన్ని మాధ్యమములు క్లోజ్ చేసి కేవలం ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధన ఉంటుందని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.కాబట్టి మీరు మా మీద దయ ఉంచి మా పిల్లల భవిష్యత్తును మరియు మా ఉర్దూ భాషను |కొనసాగిసాగిస్తూ దయచేసి మా ఉర్దూ పిల్లలకు ప్రత్యేకంగా Z.P.H.S URDU SCHOOL ను ఏర్పాటు చేయలనికోరుతున్నాము. నియోజకవర్గంలోనే అత్యధిక ముస్లిం మైనారిటీలు ఉండేది హొళగుంద మండలంలోనే. ప్రస్తుతం ఉర్దూ మీడియంలో 90 మంది పిల్లలు చదువుతున్నారు మరియు మా మండలం ఇరుపక్కల ఉర్దూ ఎలిమెంటరి స్కూల్ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉన్నది.దయచేసి మా విన్నపమును మన్నించి తమరు మాకు ఉర్దూ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తారని మా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచి మా కోరికను అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమంలో R U T A అసోసియేషన్ రాయలసీమ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాకి బ్ సెక్రటరీ నిసార్ అహ్మద్ మరియు వారి టీం ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముస్లిం పెద్దలు ఉర్దూ సంఘం నాయకులు m p p తనయుడు ఈసా, హమీద్, సుభాన్, ఇర్ఫాన్ ,భాష అబ్దుల్ రెహమాన్ చికెన్ మహబూబ్ బాషా ఎస్ .ఎస్. వి. షబ్బీర్ ,ఎం షఫీ, బషీర్ సాబ్, రహంతుల్లా, బి. అతావుల్లా ,జి. నూర్, కే. అనీష్ ,పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొన్నారు.