తక్షణమే రైతు సమస్యలు పరిష్కరించాలి…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఏఐటీయూసీ సిఐటియు ఏపీ రైతు సంఘం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి రైతులపై కాల్పులు విరిమింపచేయాలని రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి బైకు ట్రాక్టర్ ఆటో ర్యాలీలో భాగంగా హోళగుంద మండల కేంద్రంలో స్థానిక వాల్మీకి సర్కిల్ నుండి బస్టాండ్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. హోళగుంద నందు ధర్నా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం కర్నూల్ జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి తిమ్మయ్య సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హామన్ సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతాంగ ఉద్యమ సందర్భంగా రైతుల పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పిస్తామని స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తే హామీ ఇచ్చి సంవత్సరం గడిచిన ఆమె నెరవేర్చునందుకు రైతులు పంజాబు హర్యానా రాష్ట్రాల నుండి వస్తున్నటువంటి రైతులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో పోలీసు బలగాలని మిలిటరీ దళాలని పెట్టి రైతులపై బాస్వ వాయువుల్ని, సౌండ్ బాంబులను కాల్పులు జరిపి ఐదు మంది రైతులను బలిగున్నారని తక్షణమే రైతు సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చెల్లరేగుతుందని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రైతులు కార్మికులు ప్రజలు సన్నద్ధం కావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రంగన్న ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి కృష్ణ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ సిఐటియు మండల కార్యదర్శి నాగరాజు సిపిఐ సిపిఎం రైతు సంఘం నాయకులు ఆటో యూనియన్ నాయకులు మొదిన్ శాబిర్ అషెన్ భాష పీ రాజా బాబా మస్తాన్వలి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.