పల్స్ పోలియో గోడపత్రికలను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్
1 min readచంటి బిడ్డ తల్లులు తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ క్యాంపు కార్యాలయములో నాడు నిర్వహించబడుచున్న పల్స్ పోలియో కార్యక్రమమునకు సంబంధించిన పోస్టర్లు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ ప్రపంచంలోని కొన్ని దేశాలలో పోలియో ఇప్పటికి ఉన్నందున అది మళ్ళి భారతదేశంలోని చిన్నారులకు సోకకుండా రక్షణ కల్పించడానికి 0-5 వయస్సు గల ప్రతి చిన్నారులకు విధిగా పోలియో చుక్కలను ఇప్పించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని చంటి బిడ్డ తల్లులకు సూచించారు. కావున చిన్నారుల తల్లిదండ్రులు అందరు అశ్రద్ద చేయకుండా తమ తమ చిన్నారులకు మీ దగ్గరలో ప్రభుత్వం వారు ఏర్పాటుచేసిన పోలియో చుక్కల కేంద్రానికి వెళ్లి వాక్సిన్ వేయించవలసినదిగా కోరరు. ఏదైనా సమాచారం కోసం మీ దగ్గరలో గల ఆశా, ఏ ఎన్ ఎం, అంగన్వాడి కార్యకర్తలను సంప్రదించలన్నరు. ఈ కార్యక్రమంలో డా. నాగేశ్వరరావు జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి, ఏలూరు జిల్లా, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ బీసీ సెల్ అధ్యక్షులు ఘంటా ప్రసాదరావు పాల్గొన్నారు.