డెల్టా ప్లస్ తో మరోసారి లాక్ డౌన్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : డెల్టా ప్లస్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా గుబులు రేపుతోంది. రెండో దశ కేసులు క్రమంగా తగ్గుతున్నాయనుకుంటున్న సమయంలో.. డెల్టా ప్లస్ కేసులు కలవరపెడుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ దేశాల్లో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఒక వారం ప్రజలు ఇంటికే పరిమితం కావాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. గత వారంలో 65 కేసులను గుర్తించారు. కరోన మహమ్మారి నుంచి బయటపడ్డాక ఇంత దారుణమైన పరిస్థితులు ఇప్పుడే చేస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
ఇజ్రాయిల్ లో .. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్న దేశాల్లో ఇజ్రాయిల్ ముందుంది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని అనుకుంటున్న నేపథ్యంలో కొత్త వైరస్ వేరియంట్ ఇజ్రాయిల్ లో వణుకు పుట్టిస్తోంది. ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు అవసరం లేదని ప్రకటించిన ప్రభుత్వం వారంలోపే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇండోర్ ప్రదేశాల్లో కూడ తప్పనిసరి మాస్కులు ధరించాలని ఆదేశించింది. రోజూ 100 కేసులు పైగా బయటపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.