దొంగతనం కేసులో ముద్దాయి అరెస్ట్
1 min read పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో ఈనెల 1వ తేదీన షేక్ మహమ్మద్ గౌస్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు మరియు 20వేల నగదు దొంగలించిన సంగతి తెలిసిందే.మహమ్మద్ గౌస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రెండు బృందాలను ఏర్పాటు చేశారు.నాలుగు రోజుల్లోనే కేసును చేదించారు పోలీసులు. నందికొట్కూరు రూరల్ సీఐ విజయ భాస్కర్,మిడుతూరు ఎస్ఐ ఎం జగన్ మోహన్ నిందితున్ని మీడియా ఎదుట వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా సీఐ విజయ భాస్కర్ మరియు ఎస్సై జగన్మోహన్ మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణానికి చెందిన అల్లూరు రోడ్డు లో నివసిస్తున్న మహమ్మద్ గౌస్ కుమారుడు షేక్ మహమ్మద్ హుస్సేన్(27) ను నిన్న మంగళవారం ఉదయం 8:30 కు నందికొట్కూరు మార్కెట్ యార్డు వద్ద ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి మొత్తం 11 తులాల బంగారు ఆభరణాలు మరియు 20వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వీటి విలువ మొత్తం 6 లక్షల 800 రూపాయలు అవుతుందని నిందితున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది చెన్నయ్య,ఈశ్వర్,నాగార్జున, పరశు