వరుసగా నాల్గో ఏడాది వై.ఎస్.ఆర్. చేయూత పథకం
1 min readవైఎస్ఆర్ చేయూత కింద జిల్లాలో ఈ ఏడాది 1,14,874 మందికి రూ. 215.39 కోట్లు..
జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లాలో వై.ఎస్.ఆర్. చేయూత పథకం 4వ విడత సాయం కింద 1,14,874 మంది అర్హులైన లబ్దిదారులకు రూ. 215.39 కోట్లను మహిళల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.గురువారం ఏలూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, డిఆర్ డిఏ పిడి డా. ఆర్ విజయరాజు, మెప్మా పీడీ ఇమ్మానియేల్, పశు సంవర్ధకశాఖ జెడి డా. జి. నెహ్రూబాబు, పలువురు చేయూత లబ్ధిదారులు తో కలిసి అనకాపల్లి జిల్లా కశింకోట మండలం పిసినికాడ నుండి రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నాల్గో విడత చేయూత పథకం ప్రారంభ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి పిసినికాడ నుంచి సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన అనంతరం ఏలూరు జిల్లాకు సంబంధించిన 4వ విడత వై.ఎస్.ఆర్. చేయూత పథకం కింద 1,14,874 మంది బ్యాంకు ఖాతాలకు 215.39 కోట్ల రూపాయలను జమ చేసిన నమూనా చెక్కును జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగడానికి చిన్న తరహా వ్యాపారాలు, పాడి గేదెలు, గొర్రెలు , బట్టలు, కిరాణా షాపులు తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ జీవనోపాదిని మెరుగుపరుచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా వై.ఎస్.ఆర్. చేయూత పథకం ద్వారా బి.సి., ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ. 18,750 ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 3 విడతల్లో చేయూత ఆర్ధిక సాయం కింద రూ. 561.53 కోట్లు అందించగా ఈ రోజు 4వ విడత సాయం కింద రూ. 215.39 కోట్లు అందించడం జరిగిందన్నారు. వై.ఎస్.ఆర్. చేయూత 4వ విడతలో ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో 18,089 మంది మహిళలకు రూ. 33.92 కోట్లు, దెందులూరు నియోజకవర్గంలో 15,912 మంది మహిళలకు రూ. 29.84 కోట్లు, గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల మండలంలో 4202 మంది మహిళలకు రూ. 7.88 కోట్లు, కైకలూరు నియోజకవర్గంలో 16107 మంది మహిళలకు రూ. 30.20 కోట్లు, నూజివీడు నియోజకవర్గంలో 19131 మంది మహిళలకు రూ. 35.87 కోట్లు, పోలవరం నియోజకవర్గంలో 19063 మంది మహిళలకు రూ. 35.74 కోట్లు, ఉంగుటూరు నియోజకవర్గంలో 10519 మంది మహిళలకు రూ. 19.72 కోట్లు, ఏలూరు నియోజకవర్గంలో 11851 మంది మహిళలకు రూ. 22.22 కోట్లు విడుదల అయ్యాయన్నారు.