సకల పాపాహరణం దుర్గ భోగేశ్వరం..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని గడిగరేవుల గ్రామం వద్ద వెలసిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం లో కొలువై ఉన్న ఈశ్వరుడిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల విశ్వాసం దుర్గ భోగేశ్వర స్వామి ఉత్సవాలకు సకలం సిద్ధమైంది మహాశివరాత్రి సందర్భంగా ఈనెల ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు ఏడో తేదీ గడిగరోల గ్రామంలో ఉత్తమ మూర్తులకు వర వరప్రయాణంతో మొదలవుతున్నాయి ఎనిమిదో తేదీ స్వామి వారి ఆలయ ప్రవేశం ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు ఉంటాయని ఆలయ చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు 9వ తేదీ వాహన సేవ తిరుమంజసం కళ్యాణోత్సవం జరుగుతాయని పదవ తేదీ రథోత్సవం 11వ తేదీ నాకవలి వసంతోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు ఉత్సవాల సందర్భంగా తొమ్మిదవ తేదీ రాష్ట్రస్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రియతమ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరవుతారని 4 పండ్ల లోపు వృషభాలకు వరుసగా 30000. 20000 .15000. విజేతలకు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులు అవ్వాలని దూర భారం నుండి వచ్చే భక్తులకు ఆర్టీసీ సంస్థ నంద్యాల నుండి నందికొట్కూరు నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు వచ్చిన భక్తులకు కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఆర్యవైశ్య ఆశ్రమంలో ఉచిత భోజన సదుపాయం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు క్యూలైన్లు పార్కింగ్ స్థలాలు తాగునీరు పారిశుధ్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు.