PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల ఆత్మీయ సంమేళన సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండల కేంద్రమైనా గోనెగండ్ల బాషా ఫంక్షన్ హాల్ నందు  నియోజకవర్గ, మండలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల ఆత్మీయ సంమేళన సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త బి వై రామయ్య, ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బంట్టా రేణుక, జిల్లా కార్యదర్శి నాగేష్ నాయుడు , ఈసందర్భంగా శ్రీమతి బుట్టా రేణుక  మాట్లాడుతూ జగన్ లాంటి పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ,  బీసీ, మైనార్టీ ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ తో పరిపాలన మొత్తం ప్రజల దరి చేరిందన్నారు.  అణగారిన వర్గాల ప్రజలు ప్రభుత్వ ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఈ వ్యవస్థను ప్రధానంగా తీసుకొచ్చామని చెప్పారు. జగన్ హయాంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కనీసం నాలుగైదు పథకాల ప్రయోజనాలు అందాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలను రేపటి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బుట్టా శివనీలకంఠ , మండల యుత్ ప్రెసిడెంట్, మండల కన్వీనర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author