సిలువ మార్గంలో పాల్గొన్న శ్రీశ్రీశ్రీ మహాఘన డాక్టర్ జయరావు పొలిమేర
1 min readవెయ్యి మంది దైవజనులు పీఠాధిపతులు,గురువులు మఠకన్యలు తో భారీ ర్యాలీ
యేసు పాపుల కొరకు రక్తము చిందించి, మనకు స్వస్థత కలిగించెను
బిషప్ జయరావు పొలిమేర
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : పవిత్ర శుక్రవారం (గుడ్ ఫ్రైడే ) శుక్రవారం విజయ విహార్ సెయింట్ తెరిసా ప్రాంగణం నుండి సిలువ మార్గంను ఏలూరు ఆర్ సి ఎం ఏలూరు పీఠాధిపతులు బిషప్ జయరావు పొలిమేర ప్రారంభించారు. ఒకటవ స్థలం నుండి ప్రారంభమై ఫైర్ స్టేషన్ సెంటర్. జిల్లా కోర్టు సెంటర్. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి అమీనా పేట లూధరన్ చర్చ్. సెయింట్ ఆన్స్ కాలేజీ నుండి. 14వ స్థలం జే వి ఆర్ నగర్ లో అమ్మలోద్భవి మాత మహాదేవాలయం వరకు సుమారు వెయ్యి మంది దైవజనులు పీఠాధిపతులు, గురువులు, మహిళలు ఆధ్యాత్మిక ప్రార్థన. స్తుతి గీతాలతో భారీర్యాలీ తో చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ మహాగన బిషప్ జయరావు పొలిమేర మాట్లాడుతూ అతడు మన తప్పిదముల కొరకు గాయపడిను, మన పాపమూల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరేను అన్నారు. క్రీస్తు రక్తం చిందించి మన పాపముల నుండి నరులను రక్షించి దేవునికి దగ్గర చేశారని అన్నారు. శ్రమ లేనిదే సంతోషము లేదన్నారు. ఆ దేశ రాజు పిలాతు ముందు యేసు ఉన్నే కప్పుకున్న గొర్రె పిల్లవలె మౌనమోహించెను అన్నారు. ఇతనిలో నాకు ఏ దోషము కనబడలేదు అని పిలాతు అనెను. అయినను ఆయనకు మరణశిక్ష విధించాలని కేకలు వేశారు అన్నారు. రోమన్ లో బందిపోట్లకు విధించే సిలువ మరణశిక్ష ఏసుక్రీస్తుకు విధించ రన్నారు. ఆయన మరణం పరమపవిత్రమన్నరు. సిలువ నుండి యేసు భౌతిక దేహాన్ని దించి పరిమళద్రవ్యాన్ని, అత్తరుని పూచి నార వస్త్రము చుట్టి సమాధిలో ఉంచెను. ఆయన మూడవ దినమున మృత్యుంజయుడై లేచెను అన్నారు. అమలోద్భవి మాత ప్యారిస్ ఫ్రీస్ట్ ఇంజమాల మైఖేల్ ఆధ్వర్యంలో ఈస్టర్ వేడుకలు, కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి. కార్యక్రమంలో జి మోజేష్, సహాయక గురువు ఏ రాకేష్, ఎం రాజు, ఇoజమాల పాల్, అల్ఫన్స్ , ఏఎంసీ డైరెక్టర్ జక్కుల బెనర్జీ, జేవిఆర్ మాస్టర్, పీఠాధిపతులు, గురువులు, మఠ కన్యలు, దీక్షాదారులు, యువతి యువకులు మరియు సంఘ కాపరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.