మూగజీవులకు త్రాగునీటి వసతి కల్పించండి..
1 min readడీపీఓ శ్రీనివాస విశ్వనాధ్
పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు
సిబ్బందితో కార్యాలయంలో సమావేశం, పలు సూచనలు సలహాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: త్రాగునీటి కోసం మూగజీవులు గ్రామాలలో ఇబ్బంది పడుతున్నాయని జంతువులకు త్రాగునీటి వసతి కల్పించి జంతువులను ఆదుకోవాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి విశ్వనాధ్ పంచాయతీ కార్యదర్శలకు ఆదేశాలు జరిచేసారు. శనివారం తన కార్యాలయంలో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు డీపీఓ చేసారు. వేసవి తాకిడి ఎక్కువగా ఉండడం, భూగర్భ జలాలు తగ్గడం, గ్రామాలలో చెరువులు నిండుకుండడం వలన సమస్య జటిలంగా మారిందని గ్రామాలలో మూగజీవుల కోసం ఏర్పాటు చేసిన త్రాగునీటి తోట్టెలను పునరుద్దరించి జంతువుల కోసం త్రాగునీటి వసతి కల్పించాలని అన్నారు. చెత్త, ఎండుటాకులు, మురికితో ఉన్న తోట్టెలను శుభ్రపర్చి నీటితో నింపాలని ఇది వేసవి ప్రణాళికలో భాగమని గుర్తుచేసారు. లైవ్ స్టాక్ రికార్డు ప్రకారం జిల్లాలో రెండు లక్షల ఆవులు, ఐదు లక్షల గేదలు, ఐదున్నర లక్షల గొర్రెలు, రెండు లక్షల మేకలు ఉన్నాయని గుర్తుచేస్తూ పాడి పశువులు మనజాతి సంపదని, పల్లె సంస్కృతిలో భాగమైన పశువులను సంరక్షించే భాద్యత అందరిదని డీపీఓ అన్నారు. ఈ కార్యక్రమాన్ని డి.యల్.పి.ఓలు, విస్తరణ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.