భక్తులకు నీటి సౌకర్యం ఏర్పాటు
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల క్షేత్రంలో ఐదు రోజులపాటు జరిగే ఉగాది మహోత్సవాలలో ఆలయ అధికారులు.ఘనంగా నిర్వహిస్తున్నారు. కర్ణాటక మహారాష్ట్ర రెండు రాష్ట్రాల నుండి భక్తితో భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలంపాదయాత్ర చేసుకుంటూశ్రీశైలం చేరుకుంటారు.భక్తులకు ఎలాంటి మంచినీటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రపరిధిలో మహాశివరాత్రిలో ఏర్పాటు చేయబడిన మంచినీటి కుళాయిలన్నింటికి ఉగాది ఉత్సవాలలో వినియోగించుకునే వీలు కల్పించారు. క్షేత్రపరిధిలో పలుచోట్ల సుమారు 450 పైగా మంచినీటి కుళాయిలను భక్తులకు ఇంజనీరింగ్ విభాగం అందుబాటులో ఉంచారు. వేసవి తీవ్రత కారణంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కంటే అదనంగా కొన్ని సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. పాదయాత్ర ద్వారా వచ్చే భక్తుల కోసంసాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాసద్వారం, పెద్దచెరువు మరియు క్షేత్రములో భక్తులు బస చేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయడం జరుగుతోంది. కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలికంగా 1800 మీటర్ల పొడవు గల హెచ్.డి.పి. పైప్లాన్ వేసి నీటిసరఫరా కల్పించబడింది. కైలాసద్వారం భీమునికొలను మధ్యమార్గములో 1000 లీటర్ల సామర్థ్యం గల 8 సింటెక్స్ ట్యాంకులను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.