ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది
1 min read– లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్ వ్యర్ధాల రీసైక్లింగ్- పర్యావరణ పరిరక్షణ’ అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఎలెక్ట్రానిక్ వ్యర్ధాల రీసైక్లింగ్- పునర్వినియోగం పై అవగాహన కరపత్రాలను లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు విడుదల చేశారు. యువతకు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు,ఎయిర్ కండిషన్లు, టెలివిజన్లు, కెమెరాలు ,రికార్డర్లు, కంప్యూటర్లు ,ముఖ్యంగా విపరీతంగా వినియోగంలో ఉన్న సెల్ ఫోన్ల వ్యర్ధాలను రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగం చేసే అవకాశాల పైన అవగాహన కల్పించారు. నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వ్యర్ధాల ద్వారా విడుదలయ్యే కాలుష్యం ద్వారా భూమి, వాయు ,నీటి జలాచరాలపై ప్రాణాలకు ముప్పు కలిగించే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్నారు .ప్రతి సంవత్సరము లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారతదేశం వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వ్యర్ధాల సేకరణ జరుగుతుందన్నారు. వాటిని రీసైకిలింగ్ ద్వారా పునర్వినియోగం చేసే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు .యువతి యువకుల చే ‘ మన పాత ఎలక్ట్రానిక్ పరికరాలను సేకరించి రీసైక్లింగ్ కు అందజేసి భూమిని కాపాడుతామని ‘ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో లైన్స్ ఆఫ్ కర్నూల్ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి, లయన్స్ క్లబ్ సభ్యులు ,విద్యార్థిని,విద్యార్థులు నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.