సాంప్రదాయ పద్ధతిలో రంజాన్
1 min readరంజాన్ ప్రార్థన చేసేందుకు కిల్లా మసీదుకు తరలివచ్చిన పిల్లలు పెద్దలు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరులో గురువారం ముస్లిం సోదరులు సాంప్రదాయ పద్ధతిలో రంజాన్ పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఉదయం ఏడు గంటలకే చెన్నూరు మెయిన్ రోడ్ లో ఉన్న కిల్లా మసీదు వద్దకు ముస్లిం సోదరులు పిల్లలు పెద్దలు నూతన వస్త్రాలు ధరించి ప్రార్థన కోసం మసీదు వద్దకు చేరుకున్నారు. మసీదు ఆవరణంలో ప్రార్థన కోసం సల్వా పందిర్లు ఏర్పాటు చేయగా ప్రార్థనల కోసం ఆసీనులయ్యారు. మత గురువులు ముస్లిం సోదరులకు చక్కటి సందేశాన్ని పంపుతూ వారి చేత ప్రార్థన చేయించారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు. పలువురు హిందూ సోదరులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.