ఆదర్శప్రాయుడు జ్యోతిరావు పూలే…
1 min readమహిళ విద్యకు జ్యోతిరావు పూలే మార్గదర్శకుడు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, స్ర్తీ విద్య కొరకు పాటుపడిన జ్యోతిరావు పూలే అందరికి ఆదర్శప్రాయుడని జిల్లా రెవెన్యు అధికారి డి. పుష్పా మణి అన్నారుగురువారం జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతిరావు పూలే చిత్ర పటానికి డి ఆర్ ఓ డి .పుష్పా మణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈసందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ ఆర్దికంగా గానీ, సామాజికం గానీ ఒక చైతన్యవంతమైన జీవితం సాగించేందుకు చదువు చాలా అవసరమని మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడే చెప్పారని,ఆమె పేర్కొంటూ చెప్పడమే కాకుండా దానిని ఆచరించారన్నారు. కుల, లింగ, వివక్షతకు తావు లేకుండా విద్య, సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే జ్యోతిరావుపూలే ఆలోచన విధానాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన సహచరి సావిత్రిబాయికి గురువుగా మారి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని ఆమె ఈసందర్భంగా గుర్తుచేశారు. బాలికలకు, మహిళలకు చదువుకునేందుకు ప్రత్యేకంగా పాఠశాలలను నెలకొల్పారని, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆయన చేపట్టిన సంస్కరణలు చాలా గొప్పవని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బి సి సంక్షేమ శాఖా అధికారి ఆర్. నాగరాణి బి సి కార్బోరేషన్ ఈ డి ఎన్ .పుష్పాలత డి ఆర్ డి ఏ పి డి ఆర్ .విజయరాజు, ఉద్యాన శాఖా డి డి రామ్మోహన్ ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ ఇ ఎన్. సత్యనారాయణ పశుసంవర్ధక శాఖా జి. నెహు బాబు ఆర్ ఐ ఓ ప్రభాకర రావు స్పెషల్ డిప్యూటి కలక్టర్లు కె. బాబ్జి దేవకీరాణి,ఎన్ జి ఓ నాయకుడు చోడగిరి శ్రీనివాస్,దేవరకొండ వెంకటేశ్వర్లు,విద్యార్దిని విద్యార్దులు తదితరులు పాల్గొన్నరు.