ప్రపంచానికే ఆదర్శం.. రాజ్యాంగం..
1 min readఅంబేద్కర్ వారసులుగా, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలి
- వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్
కర్నూలు, పల్లెవెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత Dr. అంబేద్కర్ వారసులుగా అయన ఆశయాలను పాటించి, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని కర్నూలు వైసీపీ అభ్యర్థి Amd. ఇంతియాజ్ అన్నారు. శుక్రవారం బి ఏ ఎస్ కల్యాణమండపంలో Mrps ఆధ్వర్యంలో మాదిగల సింహాగర్జన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైన ఇంతియాజ్ మాట్లాడుతూ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శ ప్రాయుడని అన్నారు. ఎటువంటి వసతులు లేని ఆ కాలంలో, వివక్షకు గురి ఆయినా, పట్టు వదలకుండా కష్టపడి చదివి, ఎన్నో డిగ్రీలను సాధించి, రాజ్యాంగ నిర్మాత అయ్యాడని అన్నారు. తాను, IAS అధికారిని, కావడానికి, బాబా సాహెబ్ అంబేద్కరను స్ఫూర్తి గా తీసుకున్నానని అన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్నారు. తాను కృష్ణ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ అన్నప్పుడు, నగరం నడిబొడ్డున స్థలాన్ని కేటాయించామని అన్నారు. ఈ రోజు దేశం లోనే 124 అడుగుల ఎత్తు గల, విగ్రహాన్ని ఏర్పాటుచేసి, పర్యాటక స్థలంగా రూపు దిద్దుకుంద న్నారు. తాను శాసన సభ్యుడిగా గెలిస్తే, MRps డిమాండ్లను, అసెంబ్లీ లో వివిపించి, ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతా మన్నారు.జై భీమ్ కార్య కర్త లందరు, ఎన్నికలల్లో రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందించిన ఓటు హక్కుని ఉపయోగించుకుని, సేవ చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని అన్నారు. మీ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమం లో MRPs నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.