నాటికి నేటికి రామరాజ్యమే ఆదర్శం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శ్రీమద్రామాయణం శ్రీరాముని అద్భుతమైన గాథను ఆయన రాజ్యాన్ని పాలనా వ్యవస్థను క్షుణ్ణంగా ఉదహరించారు. నేటి తరం పాలకులు రామచంద్ర ప్రభువును ఆదర్శంగా తీసుకుని ప్రజలను పాలించాలి అని చిత్రకారుడు, కథా వాచకుడు హరిబేల్ ఉదయ్ కుమార్ శ్రీచక్ర అన్నారు. బలహీనులను ప్రభువులు ఎలా ఆదరించాలి, ఆదర్శ పాలన అంటే అది రామరాజ్యమే నాని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరం, రాంబొట్ల దేవస్థానం నందు ఏర్పాటు చేసిన శ్రీమద్రామాయణ ప్రవచన సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు వారు ‘శ్రీ రామ రాజ్యం’ అనే అంశంపై ప్రవచించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి దినేష్, ఆలయ కమిటీ ఛైర్పర్సన్ నగరూరు దీప్తి, కార్పోరేటర్లు నగరూరు శ్రీనివాసులు, శేషుయాదవ్ , మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, జెట్టి యాదవ్, అర్చకులు గిరిశ్ శర్మ, మహాలక్ష్మీ , కృష్ణ కాంత్, ఆలయ సిబ్బంది పెద్ది శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, శ్రీవారి సేవకులు మల్లేశ్, మహాలక్ష్మీ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉపన్యాసకుడిని ఆలయ కమిటీ ఘనంగా సన్మానించారు.