గడిగరేవులలో ఘనంగ శ్రీరామనవమి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి పండుగ సందర్బంగా శ్రీ సీతా రాముల వారి కళ్యాణం కన్నుల విందుతో అంగరంగ వైభవంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కృష్ణమూర్తి, ధర్మకర్త చింతల గోవిందరాజులు మాట్లాడుతూ.. లోక కళ్యాణార్థం రాముడు మానవాళికి కుటుంబంలోని బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయత, అనురాగాలు తో మెలగాలని నిర్దేశించడ జరిగింది. శ్రీరామచంద్రుడు భక్తుల కొరకు ఆరాటపడే కథలు విశిష్టత తెలియజేశారు.అనంతరం భక్తులకు భోజన ఏర్పాట్లు, సాయంత్రం స్వామి వారి గ్రామోత్సవం, వివిధ సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కృష్ణమూర్తి, ధర్మకర్త చింతల గోవింద రాజులు,గ్రామ సర్పంచ్ BS రామ్మోహన్ రెడ్డి, గ్రామ పెద్దలు ఏరాసు వెంకటరమణ రెడ్డి, ఐసాని వెంకట రెడ్డి గ్రామ ప్రజలు, అభయసేవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.