ఏలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని నామినేషన్ దాఖలు
1 min readఆయన వెంట వేలాదిగా పాల్గొన్న కార్యకర్తలు, అభిమానులు,పార్టీ శ్రేణులు..
మీ ఆదరి అభిమానంతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసిపి అభ్యర్థులను గెలిపించండి
వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయండి
సంక్షేమల రథసారథి ఆళ్ల నానికి జననీరాజనం..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికలకు 4 వ సారి ఎమ్.ఎల్.ఏ గా హ్యాట్రిక్ విజయం దిశగా మాజీ మంత్రి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పాదయాత్ర గా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఎమ్.ఎల్.ఏ ఆళ్ల నాని నామినేషన్ శ్రీ రామ్ నగర్ క్యాంప్ కార్యాలయం నుండి వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ, డప్పుల హోరుతో, కార్యకర్తల నృత్యాలతో నగరంలో పండుగ వాతావరణం తలపించేలా ఎమ్.ఎల్.ఏ.అభ్యర్థి ఆళ్ల నాని కి గజమాలలు వేసి భారీ ఊరేగింపుగా పాదయాత్ర ప్రారంభ మయ్యింది. మీ అందరి అభిమానంతో వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని శిరస్సు వంచి నమస్కరించి అభివాదాలు చేస్తూ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర సెయింట్ ఆన్స్ కాలేజీ, అమీనాపేట, అశోక్ నగర్, డి.మార్ట్, సుబ్బమ్మ దేవి స్కూల్, 12 పంపుల సెంటర్, ఏ. కే. జి. సెంటర్, నూకాలమ్మ గుడి, ఆదివారపు పేట, సి. ఎస్. ఐ. స్కూల్ వద్ద ఫ్లై ఓవర్ మీదుగా పాత వంతెన, బిర్లాభవన్ సెంటర్, గడియారపుస్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ఆళ్ల నాని మండుటెండ సైతం లెక్కచేయకుండా పాదయాత్ర గా భారీ వూరేగింపు తో చేరుకొన్నారు. పాదయాత్ర పాల్గొన్న ప్రతి ఒక్కరూ చివరి వరకు అదే ఉత్సాహంతో జోష్ నింపారు. మహిళలు కూడా అడుగడుగునా హరతులతో, పూల వర్షం కురిపించారు. వై. ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎమ్.ఎల్.ఏ. అభ్యర్థి గా ఆళ్ల నాని రిటర్నింగ్ అధికారి ఎమ్. ముక్కంటి కి తన నామినేషన్ పత్రం దాఖలు చేసారు. ఈ కార్యక్రమం లో వైసిపి ఏలూరు ఎమ్.పి. అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, దెందులూరు వై.ఎస్.ఆర్. పార్టీ ఎమ్. ఎల్.ఏ. అభ్యర్థి కొటారు అబ్బాయి చౌదరి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, జెడ్.పి. చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదు, ఏ. పి. మెడికల్ బోర్డు సభ్యులు దిరిశాల వరప్రసాద్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏ.ఎమ్.సి. చైర్మన్ నెర్సు చిరంజీవి, మాజీ చెర్మన్ మంచెం మై బాబు, జిల్లా బి.సి. సెల్ అధ్యక్షులు ఘంటా ప్రసాద్, డిప్యూటీ మేయర్లు నూక పెయ్యి సుధీర్ బాబు, గుడి దేశ శ్రీనివాస్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,ఎన్నికల పార్టీ ఇంచార్జ్ లు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.