PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రైవేట్​ గిడ్డంగులలో…నిత్యావసరాలు నిల్వ..!

1 min read

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగులలో మెయింటెనెన్స్​ అధికమవుతుందన్న డి.ఎం.

  • ప్రైవేట్​ గిడ్డంగులు ఎమ్మెల్యే అనుచరులవే… కాంట్రాక్టర్లూ… వారే…
  • నిత్యవసరాలు పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి
  • కూటమి ఆదోని అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి ఆరోపణ

ఆదోని, పల్లెవెలుగు:  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన గిడ్డంగులలో నిత్యావరాలు నిల్వ ఉంచకుండా…. ప్రైవేట్​ గిడ్డంగులలో నిల్వ ఉంచుతూ…. బియ్యం స్మగ్లింగ్​కు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డిపై ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి ఘాటుగా విమర్శించారు. గురువారం పట్టణంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గిడ్డంగులలో పని చేసే కూలీల స్థితిగతులను  తెలుసుకునేందుకు కూటమి నేతలు డా. పార్థసారధి, గుడిసె కృష్ణమ్మ తదితరులు వెళ్లారు.  అక్కడ నిత్యవసర సరుకులు ప్రభుత్వ గిడ్డంగులలో నిల్వ ఉంచకుండా… ప్రైవేట్​లో నిల్వ ఉంచుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయిన డా. పార్థసారధి….పౌరసరఫరాల శాఖ డిపోమేనేజర్​కు ఫోన్​ ద్వారా వివరించారు. ఇందుకు ఆమె ప్రభుత్వ గిడ్డంగులలో మెయింటెనెన్స్​ అధికంగా ఉంటుందని… ప్రైవేట్​ గిడ్డంగులలో తక్కువ అవుతుందని చెప్పడంతో…. ‘మీరు చెప్పింది కరెక్టు ఉండొచ్చని… కానీ ఇక్కడి కూలీల పరిస్థితి  ఏమిటని ప్రశ్నించారు.  రోజు కూలీ వేతనంలో ఒక రూపాయి తగ్గించుకుంటారని… గిడ్డంగుల అద్దె కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటే సరిపోతుందని డా. పార్థసారధి చెప్పడంతో…. ఇందుకు డీఎం ఆలోచించి.. చెబుతామన్నారని తెలిపారు.

కాంట్రాక్టర్లు వారే….స్మగ్లర్లు వారే…:

ప్రైవేట్​ గిడ్డంగులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి అనుచరులవేనని… నిత్యావసర సరుకులు పక్క రాష్ట్రాలకు తరలించేది కూడా ఆయన అనుచరులేనని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి ఆరోపించారు. దీంతో ప్రభుత్వ గిడ్డంగులలో పని చేసే కూలీలు పలుమార్లు ఎమ్మెల్యేను గిడ్డంగులలో రేషన్​ నిల్వ ఉంచితే… మాకు కూలీ దొరుకుతుందని, కుటుంబాన్ని పోషించుకుంటామని అడిగినా ఫలితం లేదని … కూలీలు తన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు డా. పార్థసారధి పేర్కొన్నారు.  సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే… గిడ్డంగుల కూలీలకు సంపూర్ణంగా ఉపాధి కల్పిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి …దీనికి సమాధానం చెప్పాలని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి  డిమాండ్​ చేశారు.

About Author