PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి నుండి కర్నూలులో ఏపీ న్యాయ యాత్ర

1 min read

పర్యటించనున్న వైఎస్​ షర్మిల రెడ్డి

  • వెల్లడించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావు

కర్నూలు, పల్లెవెలుగు: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారు సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా చేపట్టిన ఏపీ న్యాయ యాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి గారు ఏపీ న్యాయ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నుండి కర్నూలు జిల్లాలోనికి ప్రవేశించునని కర్నూలు జిల్లాలో ఈనెల 18వ తేదీ రాత్రి ఆలూరులో బస చేస్తారని, మరుసటి రోజు 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆలూరులో కార్నర్ మీటింగ్ ఉంటుందని అనంతరం ఆదోనిలో సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. ఆ తరువాత ఎమ్మిగనూరులో సాయంత్రం 6 గంటలకు కార్నర్ మీటింగ్ ఉంటుందని, అనంతరం కడపకు బయలుదేరి వెళుతుందని 20వ తేదీ ఉదయం షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడపలో నామినేషన్ వేసి అదే రోజు (20వ తేదీ శనివారం) సాయంత్రం 6 గంటలకు కోడుమూరులో కోట్ల సర్కిల్ లో కార్నర్ మీటింగ్ ఉంటుందని అనంతరం కర్నూలులో రాత్రి బస చేస్తారని 21-04-2024 ఆదివారం ఉదయం10 గం”లకు యాత్ర ప్రారంభమై బళ్లారి చౌరస్త, కొత్త బస్టాండ్, శ్రీ రామ టాకీస్, ఐదు రోడ్ల సర్కిల్, వైఎస్ఆర్ సర్కిల్, గౌసియా హాస్పిటల్, కొండారెడ్డి బురుజు, పాత బస్టాండ్, కింగ్ మార్కెట్, గడియారం హాస్పిటల్, చౌకులో మీటింగ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, జమ్మి చెట్టు,జోహారాపురం, వెంకాయపల్లి, గార్గేయపురం మీదుగా నంద్యాల జిల్లా లోనికి యాత్ర ప్రవేశించును. షర్మిలమ్మ గారితో పాటు డిసిసి అధ్యక్షులు బాబురావు గారు, కర్నూల్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్ గారు, కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పీజీ రాం పుల్లయ్య యాదవ్ గారు, అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్చార్జీలు, ఈ యాత్రలో వెంట ఉంటారని, కనుక  కర్నూలు జిల్లా ప్రజలు, పిసిసి సభ్యులు, డిసిసి కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సంస్థల జిల్లా మహిళా కాంగ్రెస్, ఐ ఎన్ టి యు సి, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదళ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సెల్, కిసాన్ సెల్, డాక్టర్ సెల్, లేబర్ సెల్, సాంస్కృతిక విభాగాల అధ్యక్షులు మరియు సభ్యులు, మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేయోభిలాషులు కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని బాబురావు కోరారు.

About Author