PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అబ్బయ్య చౌదరి నామినేషన్

1 min read

అంబరాన్నంటిన సంబరాలతో భారీ ర్యాలీ

జనసందోహంతో నియోజకవర్గ చరిత్రలో ఒక మైలురాయి

జై జగన్, జై అబ్బయ్య చౌదరి నినాదాలతో దద్దరిల్లిన నియోజకవర్గo

గ్రామాలు,పల్లెలు,రహదారులలో బారులు తీరిన జనం

దారి పొడవునా అఖండ స్వాగతాలతో జనసంద్రం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు నియోజకవర్గం అభ్యర్థి అబ్బాయి చౌదరి నామినేషన్ శుక్రవారం కన్నులు పండుగ జరిగింది. అబ్బయ్య చౌదరిని మాజీ మంత్రి, ఆళ్ళ నాని, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజుటిటిడి బోర్డ్ మెంబర్, నియోజకవర్గ పరిశీలకులు  నెరుసు నాగ సత్యం, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి,నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి  కడప రత్నాకర్, జెడ్పీ చైర్మన్  ఘంటా పద్మశ్రీ ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రముఖ నాయకులుఅబ్బయ్య చౌదరి అభినందనలు తెలియజేశారు. ముందుగా తల్లితండ్రులైన కొఠారు రామచంద్ర రావు, రాణిల  ఆశీర్వాదం తీసుకొని తన స్వగ్రామం అయిన కొండలరావుపాలెంలో మరియమ్మ తల్లి, గంగానమ్మ తల్లి మరియు రాముల వారి దర్శనం చేసుకొని, రాట్నాలకుంట చేరి అక్కడ నుండి రాట్నాలమ్మ తల్లి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ ఘట్టానికి అంకుకురార్పణ చేశారు. అనంతరం అసంఖ్యాక ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన అబ్బయ్య చౌదరి ముందుకు సిద్ధo అయ్యారు.భారీ జనసందోహంతో రాట్నాలకుంట నుండి సూర్యారావుపేట, పెదవేగి, గోపన్నపాలెం, సోమవరప్పాడు, ఆశ్రం హాస్పిటల్, పాలగూడెం, కొవ్వలి గ్రామాల మీదుగా దెందులూరు ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేసిన అబ్బయ్య చౌదరి కదం తొక్కారు. దెందులూరు ప్రజలకు, వైయస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ, 2024 ఎన్నికల యుద్ధం ప్రారంభం అంటూ ప్రకటించిన అబ్బయ్య చౌదరి చిరు మందహాసంతో ప్రజలకు అభివాదాలు చేశారు.నిప్పులు చెరిగే ఎండ ముందు కూడా, తగ్గేదెలే అన్న అబ్బయ్య చౌదరి తన ఎనర్జీతో అభిమానులకు జోష్ నింపారు.ఉప్పెనలా ఉప్పొంగిన ఉత్సాహం. సునామీలా కమ్మేసిన కార్యకర్తల సైన్యంఅబ్బయ్య చౌదరికి ఎదురులేదు అన్న రీతిలో అభిమానులు చెలరేగారు. దెందులూరులో వైసీపీకి తిరుగులేదంటూ చెప్పిన ప్రజలు, వైయస్ఆర్సీపీ శ్రేణులు అబ్బయ్య చౌదరి ని ఎన్నుకొని, రాబోయే ఐదేళ్ల కాలానికే కాదు, రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించిన ప్రజలులకు నా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఆ దైవాశీస్సులు, ప్రజల ఆశీర్వాదాలు, అభిమానుల ఆశీస్సులు, ముఖ్యంగా మహిళల దీవెనలతో తన జీవితకాలం రుణపడి ఉంటాను ఉంటానని శిరస్సు వంచి నమస్కరించారు.   వేలాదిమంది జన సందోహంతో నామినేషన్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి లావణ్య వేణికి నామినేషన్ దాఖలు చేశారు.

About Author