గోపాలపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత నామినేషన్
1 min read50వేల మంది కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులతో భారీ ర్యాలీ
వివిధ మత పెద్దలు, సంఘ సేవకులతో తానేటి వనితమ్మ గెలవాలని ఆశీర్వాదాలు, దీవెనలు..
హాజరైన వైఎస్ఆర్ సిపి సెక్రటరీ పెరికె వరప్రసాద్ రావు, ఏపీ పాస్టర్స్ ఫెడరేషన్ సెక్రెటరీ జీవన్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జన హృదయ నేత గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత ఈ వేళ నామినేషన్ 50 వేల మందితో ర్యాలీతో గోపాలపురంలో నామినేషన్ ఎంతో విజయవంతమైందని వైఎస్ఆర్సిపి రాష్ట్ర సెక్రటరీ పెరి కె వరప్రసాదరావు తెలిపారు. తానేటి వనితమ్మ జన హృదయ నేత అని పేదల పాలిటి పెన్నిధి నీతి నిజాయితీకి నిలువు అద్దం అని కొనియాడారు. నామినేషన్ కి ముందు తానేటి వనితమ్మ నివాస గృహంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సెక్రటరీ జీవన్ కుమార్, బిషప్ రెబ్బ ఇమ్మానియేల్, పెదబాబు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించి వనితమ్మ అత్యధిక మెజార్టీతో గెలవాలని ప్రార్థన చేసి నా నామినేషన్ కు పంపించడమైందని తెలిపారు. అనంతరం సర్వమత పూజారులు, ముస్లిం మైనార్టీ, మత పెద్దలు ఘనంగా ప్రార్థన లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాలే ఆంధ్రప్రదేశ్లో మళ్లీ 20 24 లో అధికారంలోకి వస్తుందని ఆశాభా వ్యక్తం చేశారు.