PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్ షర్మిలా  కర్నూలు నగర న్యాయ యాత్రను విజయవంతం చేయండి

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల   కే బాబురావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ వైఎస్ షర్మిలా రెడ్డి  సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రేపు కర్నూలు నగరంలో జరిగే ఏపీ న్యాయ యాత్రను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు  పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్ తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బాబురావు  మాట్లాడుతూ వైఎస్ షర్మిలా రెడ్డి  ఏపీ న్యాయ యాత్రలో భాగంగా నిన్న కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు నియోజక వర్గాలలో యాత్ర విజయవంత మైందని ఈరోజు సాయంకాలం ఆరు గంటలకు  కోడుమూరులో కోట్ల సర్కిల్ లో పబ్లిక్ మీటింగ్ ఉంటుందని, రేపు ఆదివారం ఉదయం10 గం”లకు యాత్ర బళ్లారి చౌరస్త, కొత్త బస్టాండ్, శ్రీ రామ టాకీస్, రాజవిహార్, కిడ్స్ వరల్డ్, కోట్ల సర్కిల్, కొండారెడ్డి బురుజు, పాత బస్టాండ్, కింగ్ మార్కెట్, గడియారం హాస్పిటల్, చౌకు ప్రాంతంలో పబ్లిక్ మీటింగ్ ఉంటుందని, అక్కడి నుండి ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా పూల బజార్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, కుమ్మరి వీధి నాలుగు రస్తాలు, జమ్మి చెట్టు వరకు జోహారాపురం మీదుగా నంద్యాల జిల్లా లోనికి యాత్ర ప్రవేశించునని తెలియజేశారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పిజి రాంపుల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ రేపు జరిగే పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలమ్మ  కర్నూల్ నగర ఏపీ న్యాయ యాత్రను కర్నూలు నగర ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి గౌరవ అధ్యక్షులు ఉండవల్లి వెంకటన్న, కర్నూల్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్, డిసిసి ఉపాధ్యక్షులు బి బతకన్న కే వెంకటరెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రణాళిక కమిటీ చైర్మన్ ఎస్ రామస్వామి, మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పీజీ నరసింహులు యాదవ్, జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం డిసిసి ప్రధాన కార్యదర్శులు రియాజుద్దీన్ కే సత్యనారాయణ గుప్త మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల సేవాదళ్ జిల్లా అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత, సాంస్కృతి విభాగం జిల్లా చైర్మన్ నాగ శేషులు, సోషల్ మీడియా జిల్లా చైర్మన్ అమనుల్ల, మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ డిసిసి కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం, అబ్దుల్ హై సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏ లలిత కాంగ్రెస్ నాయకులు షేక్ మాలిక్ మహిళా కాంగ్రెస్ హైమావతి సాయి భార్గవి ఎల్లమ్మ మొదలగువారు పాల్గొన్నారు.

About Author