భావితరాల కోసం పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు పరిరక్షించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భావితరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పెద్దక్క అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర గ్రంథాలయ సంస్థ సమావేశ భవనంలో నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన’ ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్’ అంశంపై అవగాహన కార్యక్రమం, మరియు చిత్రలేఖన, వ్యాసరచన పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పెద్దక్క మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణానికి హాని కలిగించే అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ మనము స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే చెట్లను నాటడంతో పాటు వాటిని పరిరక్షించుకోవడం ప్రధానమైన అంశం అన్నారు. మరో విశిష్ట అతిథి రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ చిన్నతనం నుండి పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్స్ ను వాడడం మానేయాలన్నారు. నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసి పునర్వినియోగం చేసేలా స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు సముద్రంలో కలవడం వల్ల సముద్ర జలంలో నివసించే జీవరాశి కూడా అంతమయ్యే ప్రమాదం ఉన్నదన్నారు .మొత్తం అన్ని పోటీలలో 400 మందికి పైగా విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. 22న జరిగే ధరిత్రి దినోత్సవంలో బహుమతులు అందజేయనున్నామన్నారు. కార్యక్రమంలో లక్ష్మీ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షురాలు రాయపాటి నాగలక్ష్మి , రిటైర్డ్ హెడ్మాస్టర్ గోవిందరెడ్డి ,పాఠశాలల ఉపాధ్యాయుల ప్రతినిధులు ఎస్ మహజిన్ బేగం, ఎస్ హీనా కౌసర్, వై.వాసవి హరిప్రియ ,సంధ్యారాణి, శ్రీలేఖ, సయ్యద్ జాకీర్ హుస్సేన్, జి.పి రామ్ చంద్, లైబ్రేరియన్ లు తదితరులు పాల్గొన్నారు.