PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీజీహెచ్​కు..‘జెమ్​కేర్​ కామినేని’ ఉదారత్వం..

1 min read

 వైద్య పరికరాల విరాళంగా అందజేసిన ఆస్పత్రి సీఈఓ డా. చంద్రశేఖర్​

  •  జీజీహెచ్​ సూపరింటెండెంట్​ డా. వెంకట రంగారెడ్డి అభినందన

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ యాజమాన్యం వైద్య పరికరాలను విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా  అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, గారు మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు  జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్ కర్నూలు వారు ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు వైద్య పరికరాలు ఇవ్వడానికి ముందుకొచ్చిన  జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్ CEO డా.ఎస్వి .చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకీ కంపెనీ సక్షన్ ఆపరేటర్స్ 1 మరీయు స్టాండింగ్ డైమండ్ బీపీ ఆపరేటర్స్- 15 విరాలం చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్ కర్నూలు CEO డా.SV.చంద్రశేఖర్, జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO), డా.గణేష్, జెమ్‌ కేర్ కామినేని హాస్పిటల్ జనరల్ మేనేజర్ శ్రీ.నదీమ్, తదితరులు పాల్గొన్నట్లు అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి తెలిపారు.

About Author