కూటమిలో..విభేదాల్లేవు..
1 min readసమన్వయంతో…విజయం సాధిస్తాం…
- ఓర్వలేకనే…దుష్ర్పచారం….
- ఆదోని కూటమి అభ్యర్థి డా.పార్థసారధి
ఆదోని, పల్లెవెలుగు:కూటమి(బీజేపీ–జనసేన–టీడీపీ)లో విభేదాలు లేవని… సమన్వయంతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆదోని కూటమి అభ్యర్థి డా.పార్థసారధి. కూటమి కలిసివస్తే… గెలుపు తథ్యమనే… కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆదివారం పట్టణంలోని కల్లుబావిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధారెడ్డి, జనసేన నాయకులు మహేష్ యాదవ్‌తో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి డా. పార్థసారధి మాట్లాడుతూ కల్లుబావిలో సమస్యలు అనేకం ఉన్నాయని, కానీ పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఐదేళ్ల కిందట నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా… రంగులు మాత్రమే వేయించిన జగన్ సర్కారు తామే కట్టించినట్లు గొప్పలు చెప్పుకుంటోందన్నారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసినన్నీ భూ కబ్జాలు ఎవరూ చేసి ఉండరన్న డా. పార్థసారధి… తాను అవినీతి చేయనని, సేవ మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. ఒక్క చాన్స్ అని వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి… రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశాడన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, తనను గెలిపిస్తే ఆదోనిని అభివృద్ధి చేసి చూపెడతానన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఆశీర్వదిస్తే… ఎమ్మెల్యేగా ఆదోని ప్రజల రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా డా. పార్థసారధి విజ్ఞప్తి చేశారు.