నారాయణ విద్యార్థుల ప్రభంజనం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పదోతరగతి పరీక్ష ఫలితాల్లో నారాయణ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని AGM రమేష్ కుమార్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు AGM అధ్వర్యంలో స్టానిక వెంకటరమణ కాలని లోని నారాయణ పాఠశాల ఆవరణలో సోమవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ మాట్లాడుతూ కష్టాన్ని ఇష్టం తో చదివితే ఉత్తమ ఫలితాలు వస్తాయని, అందుకు పది ఫలితాలు నిదర్శనమని అన్నారు. జిల్లావ్యాప్తంగా సి. కేదారేశ్వర(595) సి. అజయ్ కుమార్(595) మార్కులు, టీ హరిత(594), శ్లోక(594), ఎం. ఇందిరా ప్రియదర్శిని(594), ఎం. వైభవి ( 594), కె వి లోహిక (594) మార్కులు సాధించారు. అంతేకాకుండా 593 మార్కులు పైన ఇద్దరికి, 590 మార్కులు పైన 26మంది, 550 మార్కులు పైన 259మంది, 500 మార్కులు పైన 441మంది విద్యార్థులు రాణించడం గర్వకారణం అన్నారు. ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులను కో ఆర్డినేటర్ పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఉత్తమ ఫలితాలకు కారణమైన గురువులు శ్రమిస్తేని సాధ్యమైందని అన్నారు. కార్యక్రమంలో ఆర్ ఐ అన్వర్ భాష, కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి శ్రీలక్ష్మి, శ్రీ హరి ప్రిన్సిపల్స్, ఉపాధ్యవులు పాల్గొన్నారు.