పదవ తరగతి ఫలితాల్లో భాష్యం స్కూల్ ప్రభంజనం
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : 100% ఉత్తీర్ణత ఎమ్మిగనూరు భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు సోమవారం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు . భాష్యం స్కూల్లోమొత్తం 51 మంది విద్యార్థులకు గాను. 550 పైచిలుకులు సాధించిన విద్యార్థులు 16 మంది. మరియు 500పై చిలుకు సాధించిన విద్యార్థులు .. 30 మంది విద్యార్థులు స్కూల్ టాపర్ 600 మార్కులకు గాను బి. లతిక (588/600,) యం . ఆయేషా (579/600,) , ఎస్. సుజాధ్ హుసేన్(577/600) మార్కులు సాధించారు. ఫలితాల్లో విజయఢంగా మోగించిన విద్యార్థులను భాష్యం చైర్మన్ రామకృష్ణ సార్ గారు. డైరెక్టర్హ నుమంతరావు సార్ గారు. సీఈఓ అనిల్ కుమార్ సార్, ప్రిన్సిపాల్ మాచాని కవితలు అభినందించారు .. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాచాని కవిత మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు మంచి మార్కులతో జయకేతనం ఎగరవేయడంతోపాటు 100% ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు .. అనంతరం విద్యార్థులతో కేక్ కట్ చేయించి వారికి తినిపించారు స్కూల్ ఆవరణలో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.