అట్టహాసంగా సిపిఐ అభ్యర్థి రామచంద్రయ్య నామినేషన్..
1 min readనామినేషన్ కి కదలిన ఎర్ర దండు
నామినేషన్ దాఖలు చేస్తున్న సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇండియా కూటమి బలపరిచిన పత్తికొండ నియోజకవర్గం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థిగా పి. రామచంద్రయ్య సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రామచంద్రయ్య నామినేషన్ అట్టహాసంగా జరిగింది. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి ఎర్రదండు పత్తికొండకు కదిలి వచ్చింది. పట్టణ వీధుల గుండా ఎర్రజెండాలతో కమ్యూనిస్టులు కదం తొక్కారు. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ హాజరయ్యారు. పత్తికొండ, తుగ్గలి, మద్దికేర, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల నుండి సిపిఐ, సిపిఎం శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ర్యాలీ ప్రారంభమై సుంకం గేట్, తేర్ బజార్ మీదుగా గుత్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. ఈ ప్రదర్శనలో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ప్రదర్శన ముందు భాగంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరాముడు, నాగరాజు, నంద్యాల జిల్లా కార్యదర్శి శివయ్య లు ఆలపించిన విప్లవ గేయాలు, డప్పు వాయిద్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి. రామచంద్రయ్య, కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు, సిపిఎం స్థానిక నాయకులు రంగారెడ్డి ప్రసంగించారు. నిత్యం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసే రామచంద్రయ్యను గెలిపించాలన్నారు. బిజెపికి ప్రత్యక్షంగా తెలుగుదేశం, జనసేన పార్టీ ..