మండు వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకే- చలివేంద్రాలు
1 min read– అమరావతి మైత్రి సమితి అధ్యక్షులు కాశీభట్ల సత్య సాయి నాధ శర్మ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ఏప్రిల్ ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు , వడగాల్పులు నుండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు మండలాల పరిధిలో అలాగే గ్రామాలలోని రహదారుల ప్రక్కన చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల అలాగే బాటసారుల దాహార్తి తీర్చడం మహా పుణ్య కార్యమని అమరావతి మైత్రి సమితి గౌరవ అధ్యక్షులు కాశీభట్ల సత్య సాయి నాధ శర్మ అన్నారు, ఈసందర్భంగా ఆయన మంగళవారం మధ్యాహ్నం మండలంలోని రామన పల్లె బీసీ కాలనీ కూడలి వద్ద అమరావతి మైత్రి సమితి అధ్యక్షులు పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల కూడలిలా వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా, అటు ప్రజలకు, ఇటు బాటసారూలకు, ప్రయాణికులకు దాహార్తిని తీర్చేందుకు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు, జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ వేడిని బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను అందరూ పాటించాలని ఆయన తెలియజేశారు, అదేవిధంగా విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారస్తులు, అసోసియేషన్ వారు ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టి మంచి నీటితోపాటు, మజ్జిగ, అలాగే, పానకం ఏర్పాటుచేసిన అమరావతి మైత్రి సమితి అధ్యక్షులు పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్ ను ఆయన అభినందించారు , ఈ కార్యక్రమంలో రామన చంద్రమోహన్ రెడ్డి, తుపాకుల జనార్ధన్ రెడ్డి, దేవి రెడ్డి మాధవరెడ్డి ,అమరావతి మైత్రి సభ్యులు బరకం శంకరయ్య, చంగాబ్రహ్మయ్య, పెంచలయ్య, శివకుమార్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.